సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ఒకరుగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జునని ఈ మధ్యకాలంలో జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. అయితే నాగేశ్వరరావు బ్రతికున్నప్పుడు కానీ నాగచైతన్య పెళ్లి టైంలో కానీ ఇంత ట్రోలింగ్ అనేది లేదు. అయితే ఏ ముహూర్తాన సామ్ కి విడాకులు ఇచ్చేసారో..అప్పటినుంచి అక్కినేని ఫ్యామిలీకి ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కుపోయింది ఈ శని.
ఈ క్రమంలోనే మంచి చేసిన తిడుతున్నారు.. చెడు చేసిన తిడుతున్నారు జనాలు. అయినా కానీ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఇంటికి పునర్ వైభవం తీసుకురావాలని నాగార్జున నాగచైతన్యకు మళ్ళీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. గత కొంతకాలంగా శోభితా ధూళిపాలతో ఈ హీరో ప్రేమాయణం నడుపుతున్నాడు అని .. రెండో భార్యగా నాగచైతన్య ఫిక్స్ చేసుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది .
అయితే ఆ విషయంలో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది . నాగార్జున తన ఫ్రెండ్ కూతుర్ని నాగచైతన్య కి పెళ్లి చేయాలనుకుంటున్నారట . ఆమెకు ఇండస్ట్రీలో అస్సలు సంబంధం లేదు ఇండస్ట్రీలో సంబంధం లేని వ్యక్తితోనే నాగచైతన్య పెళ్లి చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అంటూ నాగార్జున ఈ పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పెళ్లి రూమర్ వైరల్ గా మారింది అంతేకాదు ఒకవేళ ఇది నిజంగా నిజమైతే మాత్రం నాగర్జున కాళ్లకు పాలతో అభిషేకం చేసిన తప్పు లేదంటున్నారు అక్కినేని అభిమానులు..!!