టాలీవుడ్లో పాత తరం స్టార్ హీరోలలో చంద్రమోహన్ ఒకరు. ఆయన నటనలోనే ఒక సహజత్వం ఇమిడి ఉంటుందన్న ప్రత్యేకత ఆయన సొంతం చేసుకున్నారు. పాతతరం హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత శోభన్ బాబు, చంద్రమోహన్, కృష్ణంరాజు, మురళీమోహన్, గిరిబాబు, మోహన్ బాబు వీళ్లంతా ఒక తరానికి చెందిన నటులుగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. చంద్రమోహన్ తన కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు దాదాపు 800 కు పైగా సినిమాలలో నటించారు.
ఇందులో హీరో పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా ఉన్నాయి. చంద్రమోహన్ కెరీర్ ప్రారంభంలో మద్రాసులోని పాండీ బజార్లో ఉండేవారట. ఆయన ముక్కుసూటి మనిషి ఏదైనా సినిమాకు కమిట్ అయినప్పుడు తనకు ఇస్తానన్న రెమ్యూనరేషన్ పక్కాగా ఇవ్వాల్సిందే అట. రెమ్యూనరేషన్ విషయంలో ఆయన చాలా కాలిక్యులేషన్లతో ఉండేవాడని అప్పటి సినీ జనాలు చెబుతూ ఉండేవారు.
అప్పట్లో హీరోయిన్ లకు ఒక సెంటిమెంట్ ఉండేది. చంద్రమోహన్‌తో హీరోయిన్గా నటిస్తే చాలు.. ఆ తర్వాత వాళ్లకు తిరుగేలేని స్టార్‌డమ్ వచ్చేది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు వచ్చేవి. అందుకే అప్పటి తరం హీరోయిన్లు అందరూ చంద్రమోహన్తో ఒక్క సినిమాలో అయినా హీరోయిన్గా నటించాలని తాపత్రయపడే వారట. విచిత్రం ఏంటంటే చంద్రమోహన్ కు రెమ్యూనరేషన్ ఎంత ? ఇచ్చినా తీసుకుంటారు.
అయితే భోజన విషయంలో మాత్రం ఆయన రాజీ పడే వారే కాదట. ఆయనకు ప్రతిరోజు చాలా సుష్టిగా భోజనం ఉండాల్సిందే. రకరకాల ఐటెం లు కూడా ఉండాలి. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా అన్ని మాసాలు తినేస్తారట. మద్రాసులోని ప్రముఖ హోటల్స్ నుంచి పక్షి మాసాలు, జింక మాసాలు ఇలా రకరకాల మాంసాలు తెప్పించి మరీ ఆయనకు భోజనం వడ్డించాలన్న కండిషన్లు ఉండేవట. ఒక్క నర మాంసం తప్ప అన్ని మాంసాలు చంద్ర హసన్ తినేస్తాడని అప్పటి సినీ జనాలు అనుకునేవారట. ఇక చంద్రమోహన్ కోట్లాది రూపాయల ఆస్తులు కూడా పెట్టారు. అయితే ఆయనకు వారసులు లేరు. ఆయన తన ఆస్తిని అంతా కూతుర్లకు ఇచ్చేశారు.