అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు వారాల తేడాలో రెండు సినిమాలతో థియేటర్లలోకి వచ్చారు. పైగా పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరంతేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా అంచనాలు అందుకోలేదు. ఈ సినిమా కొన్న వాళ్ళు అందరూ నష్టాల పాలయ్యారు. ఇక తాజాగా నిన్న చిరంజీవి తన భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా చూసిన మెగా వీరాభిమానులు.. మెగా ఫ్యామిలీ భక్తులు కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు చిరంజీవి ఈ సినిమా ఎందుకు ? తీశాడు.. ఇలాంటి రీ మేకులు ఎందుకు దించుతున్నాడు రా బాబు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.
ఎన్నో ఆశలతో ఉన్న మెగా బ్రదర్స్ ఇద్దరు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు మెగా అభిమానుల ఆశలు అన్ని పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా మీద ఉన్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకుసాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డిఫరెంట్ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులకే కాక మెగా అభిమానులకు కూడా గట్టిగా ఆశలు ఉన్నాయి. కచ్చితంగా ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్న అభిమానులకు పవను మరోసారి దెబ్బేస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ లేనట్టే. 2024 సమ్మర్ కానుకగా వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా సినిమా సగానికి పైగా షూటింగ్ జరగాల్సి ఉంది. అలాగే సీజీ వరకు కూడా కాస్త ఎక్కువే ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఓజీతోపాటు సంక్రాంతికి వస్తామంటూ ఊరిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఇప్పట్లో వచ్చేలా లేవు. ఈ రెండు సినిమాలు ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల తర్వాతే రిలీజ్ కానున్నాయి.