విజయవాడ టు హైదరాబాద్ రోడ్డులో ప్రయాణించే వారికి సూర్యాపేటలోని రాజుగారి తోట అన్నది బాగా ఫేమస్. ఇక్కడ ప్రయాణించే వారందరూ అక్కడ దాబాల్లో ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు. అంత ఫేమస్ ఈ రాజు గారి తోట. ఆ దాబా ఎవరిదో కాదు నిర్మాత అనిల్ సుంకరదే. దాంట్లో భాగస్వాములు ఉన్నా కూడా ఆ దాబా ఉన్న మూడు ఎకరాల భూమి అనిల్ సుంకరదే అంటారు. అయితే చిరంజీవి భోళా శంకర్ పుణ్యమా అని ఇప్పుడు దానిని అనిల్ సుంకర తాకట్టు పెట్టాల్సి వచ్చింది అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సినిమా ఆశించిన రేంజ్ లో మార్కెట్ కాలేదు.. మూడు వంతులకు పైగా ఏరియాలో సొంతంగా పంపిణీ చేసుకున్నారు. దీనికి తోడు సినిమా నిర్మాణానికి అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చు అయింది. ఇక చిరంజీవి రెమ్యునరేషన్ ఏకంగా రు. 65 కోట్లను అనిల్ సుంకర స్వయంగా భర్తీ చేయాల్సి వచ్చింది.
సాధారణంగా ఏ సినిమాకు అయినా ఫైనాన్స్ మీదే నిర్మిస్తారు. విడుదలకు ముందు అన్ని ఏరియాలో అమ్మి నాన్ థియేటర్ డబ్బులు సమకూర్చి ఫైనాన్స్ క్లియర్ చేస్తారు.
భోళా శంకర్ సినిమాను కీలకమైన నైజాం ఏరియాకి కూడా ఎవరు కొనలేదు. అటు ఓవర్సీస్ బయ్యర్ కూడా కొనలేదని చేతులు ఎత్తేశాడు. ఆంధ్రాలో చాలా ఏరియాలో కూడా ఇదే పరిస్థితి. ఇంకా ఘోరం ఏమింటంటే చిరంజీవి సినిమా శాటిలైట్ అమ్ముడుపోలేదు. చివరకు సాటిలైట్ రైట్స్ కింద కొంత అమౌంట్ కవర్ చేసుకోవాలని నిర్మాత అనిల్ సుంకర చిరంజీవిని రిక్వెస్ట్ చేసినా కూడా చిరంజీవి ఒప్పుకోలేదు అన్న గుసగుసలు కూడా వినిపించాయి.
చివరికి సినిమా విడుదలకు కూడా ఇబ్బందులు తలెత్తితే అనిల్ సుంకర సొంత డబ్బులు సమకూర్చుకుని ఫైనాన్స్ క్లియర్ చేసి మరి సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చిందట. అందరూ అనుకున్నట్టుగా అనిల్ సుంకర ఆస్తులు ఏవి అమ్మలేదట. అయితే వాటి పూచికత్తుపై రుణాలు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మళ్లీ అనిల్ సుంకర అమెరికాలో తన వ్యాపారాల్లో బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకొని భోళా శంకర్ సినిమా కోసం తాకట్టు పెట్టిన తన ఆస్తులు వెనక్కు తెచ్చుకోవాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.