టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో సమంత – నాగచైతన్య ఒకరు తొలి సినిమాతోనే ప్రేమలో పడిపోయిన వీరిద్దరూ సుదీర్ఘకాలం ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోని 2017 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఈ జంటకు పేరు ఉండేది. అసలు వీరిద్దరూ ఏం చేసినా మీడియా ఫోకస్ అంతా ఈ జంట మీద ఉండేది. మనస్పర్ధలు నేపథ్యంలో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.
వీరి విడిపోయి రెండు సంవత్సరాలకు దగ్గరపడుతున్నా ఇంకా వీరిద్దరి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు వీరిద్దరు విడాకులకు అసలు కారణం ? ఏంటన్నది బయటకు రాలేదు. అయితే విడాకుల తర్వాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేస్తోంది. తాజాగా విడుదలైన సమంత ఖుషి సినిమా ట్రైలర్ చూస్తే ఆమె జీవితమే కళ్ళముందు ఉన్నట్టు అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సమంత నిజ జీవితం ఆధారంగానే సినిమా తీశారా ? అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ట్రైలర్లో పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. విజయ్ – సామ్ జాతక దోషం వల్ల గొడవలు పడినట్టు చూపించారు. గతంలో చైతుకు సామ్‌కు మధ్య జాతక దోషం వల్లనే విభేదాలు వచ్చాయి. వేణు స్వామి లాంటి వాళ్లు కూడా వీరిద్దరి జాతకదోషం వల్లనే వీరి విడిపోతారని చెప్పారు. ఇక చై – సామ్ మధ్య జరిగిన అనవసరమైన వాదనాల వల్లే విడాకులకు కారణమైందన్న ప్రచారం జరిగింది.