కమెడియన్ గా కెరియర్ స్టార్ చేసి స్టార్ గా ఎదిగిన సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా తన లక్ పరీక్షించుకుని హిట్ కొట్టారు. ఆ తర్వాత పూలరంగడు, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సనిమాతో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కమెడియన్ వేషాలు పక్కన పెట్టేసి కమర్షియల్ హీరోగా నిలబడే ప్రయత్నం చేశాడు. 2011 నుంచి 2018 వరకు వరుసగా సినిమాలు చేసుకుంటూనే వచ్చాడు.
కొన్ని యావరేజ్ అయ్యాయి. చాలా వరకు డిజాస్టర్లు అయ్యాయి. ఒకే తరహా మస రొటీన్ కథలతో సినిమాలు చేస్తూ దారుణ పరాజయాలు ఎదుర్కొన్నాడు. హీరోగా అస్సలు సక్సెస్ కావడం లేదని.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఇక బన్నీ పుష్ప సినిమాలో అయితే పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ఇక తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే కార్తీ జపాన్, విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. తెలుగులో గేమ్ చేంజర్, పుష్ప 2 సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే సునీల్ డైరెక్టర్గా కూడా మెగాఫోన్ పట్టి ఓ సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ విషయం చాలా మందికి తెలియదు. సునీల్ కెరీర్లో జక్కన్న సినిమా ఒకటి. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
కథకుడిగా అతడు బాగానే రాసుకున్నా డైరెక్షన్ పరంగా అనుభవం లేక సరిగా తీయలేక మధ్యలోనే చేతులు ఎత్తేశాడట. అప్పుడు సునీల్ ఇన్వాల్ అయ్యి ఆ సినిమాలో చాలా సీన్లు తానే స్వయంగా డైరెక్ట్ చేసుకున్నాడు. అలా సునీల్ తనకు తెలియకుండానే ఆ సినిమాను చాలా వరకు డైరెక్ట్ చేశాడు.