సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం అందంగా కనిపించకపోతే ఇక్కడ జనాలు లైక్ చేయరు . జనాలు లైక్ చేయని హీరోయిన్స్ ని డైరెక్టర్ లు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు . ఈ క్రమంలోని అందం కోసం చాలామంది హీరోయిన్స్ నానా తిప్పలు పడుతూ ..బాదిని కరెక్ట్ షేప్ లో పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు . కొంతమంది శారీరకంగా కష్టపడుతూ తన బాడీని కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి చూస్తుంటే .. మరి కొంతమంది అందాల ముద్దుగుమ్మలు మాత్రం ఆ బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టడానికి పలు మెడికల్ ప్రొడక్ట్స్ సహాయం తీసుకుంటూ ఉంటారు.
చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఇదే పద్ధతులను ఇప్పుడు ఫాలో అవుతున్నారు. కష్టపడి తగ్గాలంటే ఖచ్చితంగా టైం టేకింగ్ ..అదే మెడికల్ పద్ధతిలో తగ్గాలంటే చాలా ఈజీ ..అందుకే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నేటి సమాజంలో యువత ఆలోచించకుండా అందం విషయంలో హద్దులు మీరి పోతుంది . కేవలం సామాన్య జనాలే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీస్ అయితే మెడికల్ పద్ధతి ద్వారానే అందం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారట . కాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ తాప్సి పన్ను.
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న తాప్సీ పన్ను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లాక జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఝుమ్మంది నాదం సినిమాలో తాప్సి పన్ను ఎంత బొద్దుగా ఉందో మనకు తెలిసిందే . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక చాలా స్లిమ్ అయిపోయింది. కరెక్ట్ ఫిగర్ లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయరు . అందుకే తాప్సీ పన్ను త్వరగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా అవ్వడానికి మెడికల్ పద్ధతిని ఉపయోగించుకునిందట . ఆమె త్వరగా బరువు తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ తీసుకొని బాడీని కరెక్ట్ షేప్ లో పెట్టిందట.
ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అంతేకాదు ఇప్పటికి ఆమె ఆ మెడికల్ పద్ధతి ద్వారానే తన బ్యూటీని తన బాడీ ఫిజిక్ ని కంట్రోల్ లో పెట్టుకుంటూ ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇది ఇప్పటివరకు బాగానే ఉన్నా .. రానున్న రోజుల్లో మాత్రం చాలా డేంజరస్ అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆలోచించి హీరోయిన్స్ లేదా అమ్మాయిలు అందంపై కరెక్ట్ పద్ధతిలో ముందుకెళ్లడమే బెస్ట్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!