Newsకోపం వస్తే బన్ని ఏం చేస్తాడో తెలుసా..? పరిగెత్తుకుంటూ ముందు అక్కడికే...

కోపం వస్తే బన్ని ఏం చేస్తాడో తెలుసా..? పరిగెత్తుకుంటూ ముందు అక్కడికే వెళ్తాడా..?

సాధారణంగా మనిషికి కోపం రావడం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి మనిషికైనా సరే ఎంత కంట్రోల్ గా ఉన్న మనిషికైనా సరే కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేని పని చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది . అయితే అలా కోపం వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు జనాలు పరీతంగా బూతులు తిడుతూ ఉంటారు . మరికొందరు పక్కన ఏ వస్తువు ఉంటే ఆ వస్తువులను పగలకొడుతూ ఉంటారు . అయితే కొందరు మాత్రం చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటారు .

ఆ లిస్ట్ లోకే వస్తాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోలందరూ దిగగుడుపు అనే చెప్పాలి . కాగ ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కి కోపం వస్తే అందరిలాగా హర్ట్ చేయడట .

బూతులు తిట్టడం..ఫ్రస్టేట్ అయ్యి హద్దులు మీరడం లాంటివి చేయడట. సైలెంట్ గా వెళ్లిపోయి నంబర్స్ కౌంట్ చేసుకొని పడుకునేస్తారట. ఆ తర్వాత కోపం కంట్రోల్ అయ్యాక బయటకు వచ్చి వాళ్ళకి ఎందుకు తనక కోపం వచ్చిందో వివరించే ప్రయత్నం చేస్తాడట . చిన్న విషయానికి కోప్పడి పోయే జనాలు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అలాంటిది అంత పెద్ద స్టార్ స్టేటస్ సంపాదించుకున్నా..బన్ని తన కోపాన్ని ఇంత సింపుల్గా కూల్ చేసుకుంటాడా..? అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news