Newsఆచార్య కొర‌టాల బాధ‌ప‌డ్డాడు.. మెహ‌ర్ ర‌మేష్‌కు అస్స‌లు బాధ‌లేదు.. బాధ‌ప‌డొద్దు కూడా..!

ఆచార్య కొర‌టాల బాధ‌ప‌డ్డాడు.. మెహ‌ర్ ర‌మేష్‌కు అస్స‌లు బాధ‌లేదు.. బాధ‌ప‌డొద్దు కూడా..!

పెద్దగా అంచనాలు.. ఆశలు లేకుండానే వచ్చిన చిరంజీవి భోళా శంకర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా సోమవారం నుంచి కోరుకుంటున్నా ఆశలు కూడా ఎవరికీ లేవు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి మరో డిజాస్టర్ సినిమా ఆచార్యకు భోళాశంకర్‌కు లింకులు పెట్టి రకరకాల చర్చలు మొదలయ్యాయి. మామూలుగానే చిరంజీవి తన సినిమాలలో కాళ్లు.. వేళ్లు పెట్టేస్తారన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఆచార్య సినిమాలో కొరటాల ముందు రెడీ చేసుకున్న కథ‌ కంటే చిరంజీవి చాలా మార్పులు చేర్పులు చేశారు.

సినిమా ఫ్లాప్ అయ్యాక‌ అందరూ కలిసి కొరటాలను బాగా టార్గెట్ చేశారు. చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా కొరటాలను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొరటాలు కూడా మెగా మార్పు చేర్పులు చాలా జరిగాయని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది మెహర్ రమేష్ లాంటి డిజాస్టర్ డైరెక్టర్ సినిమా తీస్తున్నప్పుడు చిరంజీవి చొరవ తీసుకోకుండా ఉంటారా ? అంటే కచ్చితంగా తీసుకుంటారు.

అసలు మెహర్ రమేష్ కూడా ఒరిజినల్ కథకు ఏకంగా 70 శాతం మార్పులు చేర్పులు చేశామని ప్రకటించాడు అంటే.. దీని వెనక కచ్చితంగా చిరంజీవితో పాటు ఆయన టీం హస్తం కచ్చితంగా ఉంటుంది. అయితే ఆచార్య‌ విషయంలో బాధితుడు కొరటాల. భోళాశంక‌ర్ విషయంలో బాధితుడు మెహర్ రమేష్. అయితే కొరటాల శివ ఆచార్య‌ ప్లాప్ అయ్యాక ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడు భోళాశంక‌ర్‌కు డిజాస్టర్ టాక్ అవడంతో మెహర్ రమేష్ పెద్ద బాధపడాల్సిన పనిలేదు.

ఎందుకంటే ? కొరటాల శివకు అపజయం అంటే ఏమిటో తెలియదు. అలాంటిది ఆచార్యతో ఆయనకు పెద్ద దెబ్బ పడింది. మెహర్ రమేష్ కు ఇలాంటి ప్లాపులు కొత్త కాదు.. మెహర్ రమేష్ కు హిట్ రావటమే గొప్ప. శక్తి, షాడో, కంత్రి లాంటి పెద్ద డిజాస్టర్ సినిమాలు మనోడు ఖాతాలో ఉన్నాయి. కాబట్టి భోళాశంక‌ర్‌కు ఎంత భయంకరమైన టాక్‌ వచ్చిన మెహర్ రమేష్ పెద్దగా బాధపడాల్సిన పని అయితే లేదు. మ‌నోడు త‌ట్టుకుంటాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news