Newsఈ విష‌యంలో టోట‌ల్ టాలీవుడ్ బాల‌య్య‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే... న‌ట‌సింహం ఒక్క‌డిదే...

ఈ విష‌యంలో టోట‌ల్ టాలీవుడ్ బాల‌య్య‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే… న‌ట‌సింహం ఒక్క‌డిదే నిజాయితీ..!

ఎస్ నిజంగా ఈ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా కేవలం బాలకృష్ణ ఒక్కడికే హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలు.. ఇప్పటి తరం స్టార్ హీరోలు ప్రతి ఒక్కరు కూడా రెమ్యూనరేషన్ విషయంలో ముక్కు పిండి వసూలు చేస్తారని అంటూ ఉంటారు. మెగాస్టార్, పవర్ స్టార్, అల్లు అర్జున్ ,జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య సినిమాలు అన్ని వంద కోట్ల రేంజ్‌లో థియేటర్ మార్కెట్ చేస్తున్నారు. ఆంధ్ర – సీడెడ్ – నైజాం – ఓవర్సీస్ అన్నీ కలిపి రు. 100 కోట్లకు పైగా వస్తుంది.

రవితేజ మార్కెట్ రు. 60 కోట్ల వరకు ఉంటుంది. నాగార్జున మార్కెట్ గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు. వెంకటేష్ మార్కెట్ రు. 20 కోట్లు ఉంటే గొప్ప. అయితే రెమ్యూనరేషన్ దగ్గరికి వచ్చేసరికి చాలా తేడా కనిపిస్తోంది. వెంకటేష్, నాగార్జున రెమ్యున‌రేషన్ రు. 10 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. వెంకటేష్ సినిమాలకు కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతూ ఉంటుంది. అసలు నాగార్జున సినిమాలు ఎంత పరమ డిజాస్టర్లు అవుతున్నాయో చెప్పక్కర్లేదు. అయినా పది కోట్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు అట.

ఇక రవితేజ సినిమాలు కూడా మూడు, నాలుగు సినిమాలకు ఒకటి హిట్ అవుతుంది. అయినా కూడా తన రెమ్యునరేషన్ 20 నుంచి 22 కోట్ల మధ్యలో ఉంది. పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ సినిమా బ్రోకు రు. 60 కోట్ల వరకు తీసుకున్నాడని.. ఇక లాభాల్లో పాతిక శాతం వాటా కూడా ఉందని అంటున్నారు. సరే లాభాలు రాలేదు అనుకున్న రు. 60 కోట్ల రెమ్యూనరేషన్ అయితే పక్కాగా ఫిక్స్. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు రు. 55 కోట్లు తీసుకుంటే.. భోళాశంకర్ సినిమాకు రు. 65 కోట్లు చేశారన్న గుసగుసలు ఇండస్ట్రీలో ఉన్నాయి.

ఈ రు. 65 కోట్లకు అదనంగా చిన్నచిన్న ఖర్చులు కలిపితే మొత్తం రు. 70 కోట్ల రెమ్యూనరేషన్ అన్నమాట. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ రెమ్యునరేషన్లు రు. 40 నుంచి 45 కోట్ల మధ్యలో ఉంటున్నాయి. వీళ్ళ అందరితో పోల్చుకుంటే మార్కెట్‌ను భేరేజు వేసుకుని చాలా రీజనబుల్గా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఒకే ఒక హీరో నందమూరి నటసింహం బాలయ్య. బాలయ్య ఇప్పటివరకు తీసుకుంటున్న హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్ రు. 18 కోట్లు మాత్రమే. ఇకపై చేసే సినిమాలు మహా అయితే రు. 20 కోట్ల వరకు తీసుకోవచ్చు. అయితే బాలయ్య సినిమాలకు థియేటర్ మార్కెట్ మాత్రం మెగా బ్రదర్స్ సినిమాల‌తో సమానంగా ఉంటుంది.

అందుకే సినిమా యావరేజ్ అయిన బాలయ్య నిర్మాతలు హ్యాపీగా ఉంటారు. బాలయ్య సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు అందరూ ఎంతో కొంత లాభంతో బయటపడతారు. అంత ఎందుకు సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఒక మోస్త‌రుగా ఆడినా కూడా ఈ సినిమా తీసిన నిర్మాతలు.. కొన్నవాళ్లు అందరూ భారీ లాభాలు కళ్ళజూశారు టాలీవుడ్ లో హీరోలు అందరూ బాలయ్యలా కాస్త రీజనబుల్గా రెమ్యూనరేషన్ తీసుకుంటే నిర్మాతలు పది కాలాలపాటు ఇండస్ట్రీలో ఉంటారు. నాలుగు మంచి సినిమాలు వస్తుంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news