Movies"నా భార్య కావాలంటే ఆ క్వాలిటీ కంపల్సరి"..రౌడీ హీరో అనిపించాడుగా..!!

“నా భార్య కావాలంటే ఆ క్వాలిటీ కంపల్సరి”..రౌడీ హీరో అనిపించాడుగా..!!

టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఖుషి . ఫ్యామిలీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించింది. ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విజయ్ దేవరకొండకు సినిమా కంటే మరీ ముఖ్యంగా ఎక్కువగా పరసనల్ క్వశచన్స్ ఎదురవుతున్నాయి .

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండకు ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడని.. ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని రిపోర్టర్స్ అడిగారు..? ఈ క్రమంలోని విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ” తను చాలా కూల్ మైండ్ అని ..నాకు పెద్దగా ఏ క్వాలిటీస్ ఉండక్కర్లేదని.. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలని ..మరి ముఖ్యంగా నా నేచర్ ని అర్థం చేసుకుని.. నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో అలాగే ఆమె ఎంజాయ్ చేసే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పుకొచ్చాడు “.

అంతేకాదు ఒకవేళ తను పెళ్లి చేసుకున్న పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకుంటాడట. తనను చాలా బాగా చూసుకొని కేరింగ్గా షేరింగ్ గా ఉండే అమ్మాయి దొరికితే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఆయన చిన్న చిన్న విషయాలు సైతం మర్చిపోతూ ఉంటాడట . అలాంటివి గుర్తు చేసే అమ్మాయి అయితే తనకి ప్లస్ అవుతుందని కొంచెం ఇంటెలిజెంట్ కొంచెం రొమాంటిక్ కొంచెం నాటి అన్ని కలగాల్సిన అమ్మాయి అయితే తనకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పుకు వచ్చాడు . దీంతో విజయ్ దేవరకొండ కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాలు చెప్పి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు . అంతేకాదు విజయ్ చెప్పిన క్వాలిటీస్ చూస్తుంటే రష్మిక మందననే ఆయనకు కాబోయే భార్య అంటూ హింట్ ఇచ్చేశాడు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . రౌడీ ఫెలో కి కావాల్సిన భార్య కూడా ఉమెన్ రౌడీ ఫెలో గా ఉండాలి అంటూ చెప్పకనే చెప్పేసాడు విజయ్..!

!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news