టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా రు. 60 కోట్లకు పైగా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని తాజాగా నటించిన సినిమా ఖుషి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే షురూ అయ్యాయి. ఇప్పటికే సినిమా టైటిల్, పాటలు, టీజర్లు,, ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా అనిపించాయి, సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమాకు ప్రస్తుతం విజయ్ నటించిన కృషి సినిమాకు మధ్య తేడాలు గమనిస్తే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.
విజయ్‌కు ఇంకా పెళ్లి కాలేదు.. అలాంటిది విజయ్ లైగర్ లాంటి యాక్షన్… బాక్సింగ్ టైప్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు అస్సలు చూడటం లేదు. విజయ్ హిట్ సినిమాలు ఓసారి చూస్తే లవ్, ఫ్యామిలీ, కామెడీ, మెలోడ్రామా ఉన్న కథల్లోనే విజయ్‌ను చూసేందుకు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. అదే విజయ్‌కు పెళ్లయ్యి పిల్లలు పుట్టాక కాస్త మెచ్యర్డ్, యాక్షన్ కథలు చేసినా జనాలు చూసేందుకు ఇష్టపడతారు.
ఇప్పుడు విజయ్‌కు పెళ్లి కాలేదు.. ఈ క్రమంలోనే క్యూట్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు… యువత, అమ్మాయిలు నచ్చే సినిమాలు చేయడమే బెటర్. ఈ క్రమంలోనే ఖుషి ఆ జానర్ సినిమా కాబట్టే తప్పకుండా హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.