Moviesతేడా వ‌స్తే నీకు మామూలుగా ఉండ‌దు… ఆ డైరెక్ట‌ర్‌కు నాగార్జున వార్నింగ్..!

తేడా వ‌స్తే నీకు మామూలుగా ఉండ‌దు… ఆ డైరెక్ట‌ర్‌కు నాగార్జున వార్నింగ్..!

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సాధారణంగా వివాదాలకు దూరంగా అందరితో కలిసిమెలిసి సంతోషంగా తన సినిమా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. నాగార్జున ఒక డైరెక్టర్ కు వార్నింగ్ ఇవ్వటం అప్పట్లో ఒక సంచలనం అయింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రాంగోపాల్ వర్మ శిష్యుడు శివనాగేశ్వరరావు. ఆయ‌న‌ దర్శకత్వంలో నాగార్జున రెండో కుమారుడు అఖిల్ బాల నటుడుగా సిసింద్రీ సినిమా తెరకెక్కించారు.

ఒకరోజు శివ నాగేశ్వరరావు ఒక ఇంగ్లీష్ కథను చూసి దానిని తెలుగులోకి అనువదించి కథ రాసుకొని నాగార్జున దగ్గరికి వచ్చాడట. మీ రెండో కుమారుడు అఖిల్‌ను తన సినిమాలో బాలనటుడిగా పరిచయం చేయాలనుకుంటున్నాను అని అడిగేసాడట. అప్పటికి అఖిల్ వయసు ఏడాది మాత్రమే. ఏడాది వయసున్న బాలుడుతో సినిమా ఏం తీస్తావు వద్దని చెప్పాడట నాగార్జున.

అయితే శివ నాగేశ్వరరావు నాగార్జున తో పాటు లేదు నేను చేస్తాను అని పదేపదే చెప్పడంతో చివరకు నాగర్జున మా అబ్బాయికి ఏదైనా అయితే నీకు మామూలుగా ఉండదు.. చాలా జాగ్రత్తగా చూసుకో అని నవ్వుతూ వార్నింగ్‌ ఇచ్చాడట. ఇక అమలు కూడా ముందు ఈ సినిమాలో అఖిల్ నటించినందుకు ఒప్పుకోలేదు.

చివరకు శివ నాగేశ్వరరావు చాలాసార్లు బతిమిలాడడంతో ఆమె ఎట్టకేలకు ఓకే చెప్పింది. అయితే షూటింగ్లో అఖిల్ కోసం శివ నాగేశ్వరరావు తో పాటు ఆ సినిమా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news