సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్లు వచ్చినా రకరకాల కామెడీ చేసిన ..నవ్వించడానికి ట్రై చేసిన ..కమెడియన్ బ్రహ్మానందం కి ఎవరు సాటిరారు అని చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు అన్ని ఫుల్ కామెడీ రోల్స్ చేసిన బ్రహ్మానందం ఇప్పుడు కాస్త రూట్ మార్చారు. నటనకు ప్రాధానమున్న పాత్రను మెసేజ్ ఓరియెంటెడ్ పాత్రను చూస్ చేసుకుంటున్నారు.
కూసింత సీరియస్ లుక్స్ లోనే కనిపిస్తున్నారు . అయితే బ్రహ్మానందం ని జనాలు మాత్రమే ఇంకా కామెడియన్ లానే చూస్తున్నారు . రీసెంట్గా ఆలీతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం తాను నటించిన సినిమాకి ఏదైనా అవార్డు వస్తే బ్రహ్మానందం ఆరోజు ఇంటికి వెళ్లి నేలపై లుంగీ కట్టుకొని పడుకుంటాను అనే విషయాని చెప్పుకొచ్చారు. దానికి కారణం కూడా వివరించారు బ్రహ్మానందం .
ఆయన మాట్లాడుతూ..” మనల్ని ఎవరైనా పొగిడితే మనకి అహంకారం పెరిగిపోతుంది . అహంకారంతో మనం బ్రతకకూడదు . దానివల్ల మనం ఇంకా దిగజారి పోతాం . అలాంటి పరిస్థితులతో బతకాలంటే ఎప్పుడు కూడా మనమే గొప్ప అనే భావన లేకుండా జీవించాలి. అందుకే నేను నన్ను ఎవరైనా పొగిడిన లేదా నా నటనకు మెచ్చి ఎవరైనా ప్రశంసలు కురిపించిన ..నేను ఇంటికి వెళ్లి ఆ రోజు మొత్తం మామూలు మనిషిగా బ్రతుకుతాను. కటిక నేలపై పడుకుంటాను.. దాని విలువ ఏంటో తెలుస్తుంది”అని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.