టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు.. సినిమా ఇండస్ట్రీలోకి కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు . అయితే ఫ్యామిలీ హీరో అంటే మాత్రం అందరికీ తక్కువ గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ . దగ్గుబాటి ఫ్యామిలీ నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి సినిమాలో నటించి మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పటివరకు మాస్ యాక్షన్ సినిమాలు ప్రధానంగా తెరకెక్కుతున్న టైంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో కూడా స్టార్ హీరో అవ్వచ్చు అని ప్రూవ్ చేశాడు వెంకటేష్ . అంతే కాదు లేడీస్ ని థియేటర్స్ కి రప్పించిన ఘనత వెంకటేష్ ది అనే చెప్పాలి.
కాగా అప్పట్లో వెంకటేష్ సౌందర్య జంటకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెరపై వాళ్ళు కనిపిస్తే చాలు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ ..కేక పెట్టించే అరుపులు ఎక్కువగా వినిపించేవి . అయితే తెరపై వీళ్ళ కెమిస్ట్రీ చూసిన పలువురు జనాలు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అంటూ అపార్థం చేసుకున్నారు . మరికొందరు వెంకటేష్ – నీరజకు విడాకులు ఇచ్చేసి మరి సౌందర్యను పెళ్లి చేసుకోబోతున్నారట అంటూ ప్రచారం చేశారు . దీంతో మండిపడిన డి రామానాయుడు వెంకటేశ్ – సౌందర్యను ఆఫీస్ కి పిలిపించి మరి వార్నింగ్ ఇచ్చారట .
ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది..? అంటూ స్ట్రైట్ గా అడిగి కడిగేసారట . అయితే సౌందర్య..” మా మధ్య లాంటిది ఏదీ లేదు సార్.. అదంతా ప్రచారమే అంటూ చెప్పిన సరే ..రామానాయుడు వినలేదట.. మీ మధ్య ఏమీ లేదు అన్న సంగతి మనకి తెలుసు ..బయట వాళ్లకి తెలియదు .. నా కోడలు బాధపడకుండా ఉండాలి అంటే నువ్వు నా కొడుకు కి రాఖీ కట్టాలి అంటూ సౌందర్యచేత వెంకటేష్ కి రాఖీ కట్టించారట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ విషయం అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత వెంకటేష్ – సౌందర్య కలిసి ఏ సినిమాలో కూడా నటించలేదు..!!