సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్లు కొట్టడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అరుదైన కాంబినేషన్లు కూడా మిస్ అవుతూ ఉంటాం. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ – నయనతార, పవన్ కళ్యాణ్ – అనుష్క కాంబినేషన్లో సినిమాలు రాలేదు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ జనాలు చాలా సంవత్సరాలు ఎదురు చూశారు. అయితే వారి ఆశలు మాత్రం చేరలేదు.
ఇక నందమూరి బాలకృష్ణ – భూమిక కాంబినేషన్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా మిస్సయింది. బాలయ్య ఆ సినిమా చేసేందుకు ఓకే చెప్పి ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమాగా ఎప్పటికీ సినిమా చరిత్రలో నిలిచిపోయి ఉండేది. ఆ సినిమా ఏదో కాదు సింహాద్రి. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2003లో రిలీజ్ అయిన సింహాద్రి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.
ఈ సినిమా కథ రెడీ చేసిన స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ముందుగా బాలకృష్ణకు వినిపించారట. బాలకృష్ణ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అప్పటికే బాలయ్య చాలా ఫ్యాక్షన్ కథలతో సినిమాలు చేసి ఉండటం.. అదే టైంలో బి గోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు లాంటి ఫ్యాక్షన్ సినిమాలో నటిస్తూ ఉండడంతో మళ్లీ వెంటనే మరో ఫ్యాక్షన్ సినిమా అంటే బాగోదేమో అని నో చెప్పారు.
ఈ సినిమాలో అప్పటికే హీరోయిన్గా భూమిక తీసుకోవాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. బాలయ్య – భూమిక కాంబినేషన్ అయితే బాగుంటుందని కూడా ఆయన అనుకున్నారు. ఎప్పుడు అయితే బాలయ్య నో చెప్పారో అదే కథతో ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు రాజమౌళి. సింహాద్రి సినిమాలో మరో హీరోయిన్గా రస్నా బేబీ అంకిత నటించారు.
అయితే ఆ తర్వాత అంకిత, భూమిక బాలయ్యతో నటించారు. బాలయ్య విజయేంద్ర వర్మ సినిమాలో అంకిత హీరోయిన్గా నటించగా.. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య రూలర్ సినిమాలో భూమిక నటించారు. అయితే బాలయ్య సినిమాలో భూమిక హీరోయిన్గా కాదు.. సినిమాను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె నటించారు.