టాలీవుడ్ స్టార్ స్టోరీ రైటర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే త్రివిక్రమ్ సినిమాలకు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. త్రివిక్రమ్ ప్రతి సినిమాకు టైటిల్ ముందుగా అ అక్షరంతో స్టార్ట్ అవ్వడం ఆనవాయితి. అ..ఆ – అల వైకుంఠపురములో – అజ్ఞాతవాసి – అతడు ఇలా ఈ సినిమాల టైటిల్స్ ముందుగా అ అక్షరంతో ప్రారంభమయ్యాయి.
అలాగే త్రివిక్రమ్ సినిమాలో ఇళ్ల సెంటిమెంట్ కూడా ఉంటుంది. త్రివిక్రమ్ సినిమా అంటే ఓ ఇంటి సెట్ వుండాల్సిందే. ఒక్కసారి త్రివిక్రమ్ సినిమాలు – ఆ ఇళ్ల సంగతేంటో చూద్దాం.
- అతడు సినిమాలో నాజర్ ఇల్లు సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. సినిమాలో చాలా సీన్లు అంతా అక్కడే నడుస్తుంటాయి.
- పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో కింద పవన్ మీద.. ఇలియానా వుండే ఇల్లు సెట్ సినిమాకు చాలా కీలకంగా వుంటుంది.
- ఇక బన్నీ నటించిన జులాయిలో రాజేంద్ర ప్రసాద్ ఇల్లు కీలకం.. ఆ ఇంట్లోనే సినిమాకు సంబంధించిన కీలక సీన్లు షూట్ చేశారు.
- పవన్ బ్లాక్‌బస్టర్ అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్-నదియాల ఇల్లు కీలకం. చాలా సినిమా నడిచేది అక్కడే.
- ఇక బన్నీ నటించిన సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఇంట్లో కథ సెకండాఫ్‌లో కీలకంగా నడుస్తుంది. ఇక ఫస్టాఫ్‌లోనూ పెళ్లి తంతు జరిగే సీన్లలో ఇళ్లు కూడా సినిమాకు కీలకమే.
- అ..ఆ సినిమాలో నితిన్ ఇంటికి సమంత మారిన తరువాత కథ మొత్తం అక్కడే ఉంటుంది.
- ఇక పవన్ డిజాస్టర్ సినిమా అజ్ఙాతవాసిలో ఇంటికి బదులు ఆఫీస్ వాడితే అది కాస్తా యాంటీ సెంటిమెంట్ అయ్యింది.
- ఎన్టీఆర్ అరవిందసమేత సినిమాలో హీరోయిన్ ఇల్లు ఎలాగూ ఉంది.
- ఇక బన్నీ బ్లాక్‌బస్టర్ అల వైకుంఠపురములో…టైటిల్ నే హీరో ఇంటి మీద పెట్టారు. ఈ సినిమా కథ అంతా అక్కడే నడుస్తుంది.
- ఇక ఇప్పుడు మహేష్‌బాబు గుంటూరు కారం సినిమా కథ కూడా రెండు ఇళ్లలో నడుస్తుందని తెలుస్తోంది. తాత ప్రకాష్ రాజ్ (గుంటూరు దగ్గర పల్లెటూరు) ఇల్లు, రెండవది హీరో తల్లి వుండే హైదరాబాద్ ఇల్లు అంటున్నారు. అలా త్రివిక్రమ్‌కు టైటిల్లో అ సెంటిమెంట్, ఇళ్లు సెంటిమెంట్ కామన్‌గా మారిపోయాయి.