సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో ముందు నుంచి చాలా గందరగోళం చోటు చేసుకుంటుంది. ముందుగా అనుకున్న హీరోయిన్ పూజ హెగ్డే మారిపోయింది. ఆమె ప్లేసులో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. ఇక సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారు అన్న రూమర్లు కూడా వచ్చాయి.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను కూడా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని మహేష్ అభిమానులు ఆశపడ్డారు. అయితే పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి మహేష్ అభిమానులను సినిమా మేకర్స్ దారుణంగా డిసప్పాయింట్ చేశారు. బుధవారం మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ గళ్ళ లుంగి.. నోట్లో బీడీ పెట్టుకున్న డిఫరెంట్ లుక్ రిలీజ్ చేశారు. మాస్ అభిమానులను ఇది బాగా ఆకట్టుకుంది.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ సినిమాపై ఇప్పటికే కొనసాగుతున్న గందరగోళానికి తోడుగా రిలీజ్ డేట్ విషయంలో మరో గందరగోళం చోటుచేసుకుంది. అసలు మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు ఏదో ఒక సందేహం ఉంటుంది. అతడు, ఖలేజా రెండు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బుల్లితెరపై మాత్రం ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. దీనికి తోడు ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అప్డేట్లు సరిగ్గా ఇవ్వటం లేదు.
అసలు ఏం జరుగుతుందో కూడా ఫ్యాన్స్ కు అర్థం కావటం లేదు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న గుంటూరు కారం సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా తెలియజేసిన కొత్త పోస్టర్లో రిలీజ్ డేట్ కూడా మారిపోయింది. జనవరి 12న రిలీజ్ అని డేట్ వేశారు. దీంతో గుంటూరు కారం గందరగోళం ఇప్పట్లో ఆగేలా లేదు.