ఇటీవల మెగా కాంపౌండ్ హీరోలకు అసలు కాలం కలిసి రావడం లేదు. అందరూ వరుస పెట్టి ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ బ్రో ఆ తర్వాత చిరంజీవి భోళాశంకర్.. తాజాగా ఇదే లిస్టులోకి చేరింది వరుణ్ తేజ్ గాండీవ ధారి అర్జున. ఈ సినిమా కూడా ఎపిక్ డిజాస్టర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. చివరకు ఫస్ట్ వీకెండ్ లో కూడా ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఏకంగా తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.
సినిమా మొత్తం 45 కోట్లు ఖర్చుపెట్టి తీశారు. తొలిరోజు కేవలం ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి షేర్ రాబట్టింది. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే లోయస్ట్ ఓపెనింగ్ చిత్రం. ఏంటంటే వరుణ్ చివరి సినిమా గని కూడా డిజాస్టర్. అయితే ఆ సినిమాకు తొలి రోజు మూడు కోట్లకు పైగా షేర్ వచ్చింది. తాజా సినిమాకు కోటి కూడా షేర్ రాలేదు. ఇక మూడవరోజు కేవలం 26 లక్షల షేర్ మాత్రమే వచ్చినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ సినిమా బడ్జెట్ మొత్తం 45 కోట్లు అయింది. కథను అధిక భాగం లండన్లో షూట్ చేయడంతో అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిందని హీరో వరుణ్ తేజ్ స్వయంగా చెప్పారు. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి రెండు కోట్లు షేర్ కూడా రాలేదు.. అంటే ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ తెలుస్తోంది. గాండీవ ధారి అర్జున అంత చెత్త సినిమా అయితే కాదు.. సోషల్ బర్నింగ్ టాపిక్ ని హాలీవుడ్ స్టైల్ మేకింగ్ లో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే అది ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కనీసం లక్ష డాలర్లు కూడా కలెక్ట్ చేయలేదు. కేవలం 86 వేల డాలర్లతో అతిపెద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఏది ఏమైనా పెదనాన్న భోళా శంకర్ సినిమా డిజాస్టర్ అయినా కనీసం 25 కోట్ల షేర్ అయినా రాబట్టింది. ఇప్పుడు పెదనాన్నను మించిన ఎపిక్ డిజాస్టర్ వరుణ్ ఖాతాలో పడింది.