స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. ఆమె నటించిన ఖుషి, సీటాడెల్ వెబ్‌సీరిస్‌లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాలను క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు వారు ఇచ్చిన అడ్వాన్స్‌లు కూడా వెనక్కు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక సమంత రీసెంట్గా మయోసైటిస్ నుంచి కోలుకుంది
ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి పూర్థిస్థాయి ఆరోగ్యంతో ఉండేందుకే సమంత గ్యాప్ తీసుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ట్రీట్ మెంట్ కోసం సామ్ ఓ టాలీవుడ్ స్టార్ హీరో నుంచి ఏకంగా రు.25 కోట్లు తీసుకుందనే ప్రచారం జరిగింది. గత రెండు మూడు రోజులుగా ఈ ప్రచారం గట్టిగా నడుస్తోంది. దీనిపై స్పందించిన సామ్ తాను ఏ హీరో దగ్గర్నుంచి డబ్బులు తీసుకోలేదని.. అసలు మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం రు. 25కోట్లు ఎందుకు ? అవుతుందని ప్రశ్నించింది.
ఈ రు. 25 కోట్లు అనేది చాలా బ్యాడ్ డీల్. నా ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టేది చాలా చాలా తక్కువ… నా కెరీర్లో కాస్తో కూస్తో బాగానే సంపాదించుకున్నానని .. తన ఆరోగ్యం బాగోగులు తాను చూసుకుంటానని స్పందించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది మయోసైటిస్ తో బాధపడుతున్నారు.. దయచేసి దాని ట్రీట్మెంట్పై స్పందించే ముందు అందరూ బాధ్యతా యుతంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం సామ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫారిన్ టూర్ ఎంజాయ్ చేస్తోంది.