కొరటాల శివ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు . బహుశా ఆయనకు కూడా తెలియదేమో అంటున్నారు అభిమానులు. హీరోయిన్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేయడానికి ఎక్కువ టైం తీసుకునే కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో హీరోయిన్ కోసం ఎన్ని నెలలు టైం వేస్ట్ చేసారో మనకు తెలియనది కాదు. అయితే అదే తప్పును ఎన్టీఆర్ దేవర సినిమాకి సైతం చేశాడు .
ఏకంగా ఎనిమిది నెలలపాటు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని పెట్టాలి అనే విషయంపైనే డిస్కషన్స్ తో టైం వేస్ట్ చేశారు . కాగా ఫైనల్లీ మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ ని సెలెక్ట్ చేసుకున్నారు . ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఇన్నాళ్లు ప్రచారం జరిగిన హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ను చూస్ చేసుకున్నారట కొరటాల శివ.
ఎన్టీఆర్ సైతం ముగ్గురు పేర్లు వివరించగా.. రష్మిక మందన్నాకి ఓటు వేశారట . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – రష్మిక మందన్నాల పేర్లు వైరల్ అవుతున్నాయి . కాగ తెరపై ఫస్ట్ టైం వీళ్లిద్దరు కలిసి రొమాన్స్ చేయబోతున్నారు . చూడాలి మరి వీళ్ల స్క్రీన్ స్పేస్ టైమింగ్ ఎలా ఉంటుందో..?