సాధారణంగా.. సినిమాలే కాదు.. నిజ జీవితంలోనూ.. భార్యా భర్తలు.. కలిసి జీవితాంతం పయనించాలనే కోరుకుంటారు. అయితే.. అనూహ్య కారణాలతో విడిపోయే సందర్భాలు వచ్చినప్పుడు చేసేది ఏమీ లేదు. తర్వాత.. మళ్లీ కలుసుకుంటారా? అంటే.. చెప్పడం చాలా కష్టం. విదేశాల్లో అయితే.. మాజీ ప్రియుడు, మాజీ ప్రియురాలు, మాజీ భర్త, మాజీ భార్య కలిసిన సందర్భాలు.. మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు కామనే.
కానీ, తెలుగు నేలపై.. ఇలాంటి ఘటనలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ, ఇలాంటివి కూడా జరిగా యి. ఒకప్పుడు తెలుగు హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన సీత గుర్తుండే ఉంటుంది. ఫ్యా మిలీ, ఎమోషన్ డ్రామా సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు పోషించి.. ప్రత్యేకతను చాటుకుంది. తమిళంలోనూ.. సీతకు మంచి పేరుంది. ఈ క్రమంలోనే సీత.. పార్దీబన్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుంది. వీరి మధ్య సుదీర్ఘ కాలం ప్రేమ సాగిందని అంటారు.
అయితే.. వీరికి ఒక పాప పుట్టిన తర్వాత.. పార్దీబన్-సీత విడిపోయారు. విడాకులు కూడా తీసుకున్నారు. కానీ, కొన్నాళ్ల తర్వాత.. మళ్లీ పార్దీబన్ దర్శకత్వంలో ఆఫర్ వస్తే.. సీత ఓకే చెప్పడం గమనార్హం. ఆయన తో కలిసి రెండు సినిమాలు మళ్లీ చేశారు. కానీ, సినిమాలకు మించి మళ్లీ పరిచయాన్ని పెంచుకోలేదు. ఇలానే జయలలిత క్యారెక్టర్ పాత్రలు పోషించినప్పటికీ.. తెలుగు సినిమాపై తన ప్రభావం చూపించింది. ఏప్రిల్ 1 విడుదల సినిమాలో విజృంభించి నటించి.. తన పేరు మార్మోగేలా చేసింది.
ఈమె కూడా తమిళంలో దర్శకుడు కార్తికేయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సొంతగా ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. అయితే.. విడిపోయారు. వీరికి పిల్లలు లేరు. అయితే.. తర్వాత.. కొన్నాళ్లకు ఇదే కార్తికేయన్ సినిమాలో ఆమెకు పాత్ర ఇస్తామని ఆఫర్ ఇస్తే.. ఒప్పుకొని చేశారు. నటన.. నటనేనని చెప్పుకొనే వారు. ఇలా.. తమ సొంత జీవితాలు ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం కనువిందు చేసేవారు.