సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు, డేటింగ్ చాలా కామన్. అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో విడాకులు కూడా చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతమంది బుద్ధిగా కాపురం చేసుకుంటూ ఉంటే ..మరి కొంతమంది విడాకులు తీసుకొని ఎవరిదారి వారిది అంటూ బ్రతికేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది జంటలు ప్రేమించుకుని.. ఆ తర్వాత ఇంట్లో పెద్దలు ఒప్పుకోక లేక వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కుదరక బయటపడకుండానే బ్రేకప్ చెప్పుకున్న జంటలు ఉన్నారు .
ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ మలయాళీ క్యూటీ నిత్యామీనన్ ..ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న తెలుగు హీరో తో ప్రేమాయణం నడిపింది. ఈ తెలుగు హీరో ఎవరు సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి కష్టపడి పైకి వచ్చాడు . అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా మారాడు . అయితే ఈ హీరోకి నిత్యామీనన్ కి మధ్య మంచి జాన్ జిగిడి దోస్త్ ఫ్రెండ్షిప్ ఉండేదట .
అంతేకాదు వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయినా పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదంతా చూసిన జనాలు వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అని.. ప్రేమాయణం నడుస్తుంది అంటూ కధలు కధలుగా చెప్పుకున్నారు . అంతేకాదు చాలామంది వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఫిక్స్ అయిపోయారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ నిత్యామీనన్ కి ఆ హీరో బ్రేకప్ చెప్పేసాడట . వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక్కవేళ అన్ని కలిసొచ్చి ఉంటే మాత్రం ఈ హీరోయిన్ పెద్దింటి కోడలు అయ్యుండేది..!!