ఈ మధ్యకాలంలో వివాహ బంధాన్ని ఎంత లైట్ గా తీసుకుంటున్నారో మన సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలు బాగా తెలిసిన విషయమే . మరి ముఖ్యంగా పెళ్లి అయిన ఏడాదికి రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటూ సోషల్ మీడియాలో పెళ్లి అనే పదాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు . అయితే అలాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల జంట .
వీళ్ళ పెళ్ళి అయ్యి చాలా కాలమే అవుతుంది. పెళ్లి అయిన వెంటనే ఇద్దరు పిల్లలను కన్నారు. ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు తారక్. లక్ష్మీ ప్రణతి సైతం ఓ వైపు ఇంటి పనులు మరోవైపు తన పర్సనల్ పనులు సైతం చకచక ఫినిష్ చేసుకుంటూ నందమూరి ఇంటి కోడలు శభాష్ అనిపించుకుంటుంది . ఈ జంటను చూసిన ఎవరైనా సరే అసూయ పడాల్సిందే . అంత అన్యోన్యతగా ఉంటుంది ఈ జంట .
ఇలాంటి క్రమంలోనే ఎంతో పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉండే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ని ఇంట్లో ఏమని పిలుస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి ఇంట్లో చాలా ఫ్రెండ్లీ గా.. రొమాంటిక్గా.. సరదా సరదాగా ఉంటారట . అంతేకాదు ఎప్పుడు సైలెంట్ గా ఉండే లక్ష్మీ ప్రణతి సైతం చాలా ఫన్నీగా తారక్ పై జోక్స్ వేస్తూ కౌంటర్స్ వేస్తూ కూడా ఉంటుందట. ఈ క్రమంలోనే మొదటి నుంచి ఎన్టీఆర్ కి బావ అని పిలిపించుకోవడం చాలా ఇష్టమట . లక్ష్మి ప్రణతితో నిశ్చితార్థం అయిపోయిన తర్వాతే ఈ విషయం ఆమెకు తెలిసింది . అందుకే అప్పటినుంచి బావ బావ అంటూనే పిలుస్తుందట . ఇప్పటికీ తారక్ ని బావ అనే సంభోదిస్తుందట . అలా పిలిస్తే తారక్ కి చాలా ఇష్టం అని.. కోపం కూడా వెంట నే తగ్గిపోతుందని కూడా తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!