Moviesఘట్టమనేని కుటుంబంలో అందరికి ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.. టోటల్...

ఘట్టమనేని కుటుంబంలో అందరికి ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.. టోటల్ ఫ్యామిలీ మొత్తం అంతేనా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సినిమాల విషయంలో ఏనాడు తండ్రి క్రేజ్ ని వాడుకోలేదు. కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు .. స్టార్ కుటుంబాలు ఉన్నాయి. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో మాత్రం అందరికీ ఒకటే క్వాలిటీ బాగా అలవాటుగా వచ్చేసింది . అదే జాలి – దయ – కరుణ సూపర్ స్టార్ కృష్ణ ఎంత జాలి గలవాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

కష్టం అని తెలిస్తే చాలు వాళ్ళ సహాయం అడగకపోయినా సరే ఇంటికి పిలిపించుకుని మరి డబ్బుని వాళ్లకు ఇచ్చే టైప్. సూపర్ స్టార్ కృష్ణ కు ఉన్న అదే క్వాలిటీ పూర్తిగా మహేష్ బాబుకు వచ్చేసింది. మహేష్ బాబు ఇప్పటికే ఎన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలకు సంబంధించిన గుండె జబ్బులు నయం చేసేందుకు మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం అందరికీ బాగా నచ్చేసింది . ఆయన కడుపున పుట్టిన సితార సైతం సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ ఉంటుంది .

రీసెంట్ గానే ఆమె పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కాగా మహేష్ బాబు కొడుకు గౌతంకి కూడా అదే క్వాలిటీ వచ్చింది. రీసెంట్గా గౌతం చేసిన మంచి పని గురించి నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ రీసెంట్గా రెయిన్ బో హాస్పిటల్స్ సందర్శించారు. రెయిన్ బో హాస్పిటల్స్ ఇలాంటి సంస్థలతో చేతులు కలిపి మహేష్ బాబు అందరికి హెల్ప్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే మహేష్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు తరుచుగా ఆసుపత్రికి వెళుతూ వస్తూ ఉంటారు . గౌతమ్ రీసెంట్గా హాస్పిటల్ కి వెళ్లి చిన్నారులను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు . తన స్కూల్ ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి హార్ట్ సర్జరీ చేయించుకున్న చిన్నారులను పరామర్శించినట్లు నమ్రత పోస్ట్ రూపంలో చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన ఫిక్స్డ్ సైతం షేర్ చేసింది. అంతే కాదు పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు తెప్పించాడు మహేష్ బాబు కొడుకు గౌతమ్ . ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న గుణం ఫ్యామిలీలో అందరికీ వచ్చేసింది అని ఘట్టమనేని ఫ్యాన్స్ గౌతమ్ ని అప్రిషియేట్ చేస్తూ ఈ ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news