సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా వచ్చిన జైలర్ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ వయసులో రజనీ పని అయిపోయిందన్న విమర్శలు వస్తున్న సమయంలో రజినీ జైలర్ సినిమాతో ఏకంగా రు. 600 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి 70 సంవత్సరాల వయసులను తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం రజనీ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రజని సూపర్ స్టార్ కాకముందు ఎన్నో వ్యసనాలకు అలవాటు పడ్డారు. సిగరెట్లు తాగటం, మందు.. అమ్మాయిలు ఇలా విచ్చలవిడిగా జలసాలు చేసేవారట. ఎప్పుడు అయితే లతతో పెళ్లి జరిగిందో అప్పటినుంచి రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారిపోయాడు. ఆ తర్వాత పూర్తి ఆధ్యాత్మిక బాట పట్టేశారు.
ఆ తర్వాత సూపర్ స్టార్ డం వచ్చాక రజనీ జీవితం పూర్తిగా మారిపోయింది. అన్ని అలవాట్లు వదిలేశారు. ఒక సౌమ్యుడిగా మారిపోయారు.
అయితే రజని సూపర్ స్టార్ అయ్యాక ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అప్పట్లో తమిళనాడు ను ఒక ఊపు ఊపేసిన ఒక స్టార్ హీరోయిన్ ఆర్థికంగా చిదిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ఆమె సాయం కోసం రజని ఇంటి గుమ్మం తొక్కి తాను పడుతున్న కష్టాలు.. తన బాధలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసిందట.
వెంటనే రజిని ఆమెకు నాలుగు నోట్ల కట్టలు తీసి ఇచ్చి నీకు ఏ సాయం కావాలన్నా నేను ఉన్నాను.. నాకు చేతనైనంత సాయం చేస్తాను.. ఎలాంటి మొహమాటం లేకుండా రమ్మని చెప్పి పంపారట. అప్పట్లో ఆ విషయం కోలీవుడ్లో పెద్ద సెన్సేషనల్ అయింది. ఆ హీరోయిన్ జెమినీ గణేషన్, శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి స్టార్ హీరోల సరసన కొన్ని సినిమాలలో నటించింది.