సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిందే. అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు నందమూరి తారక రామారావు గారు . కాగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు కూడా అదే విధంగా నందమూరి పేరున టాప్ పొజిషన్లో నిల్చోబెట్టారు . మరి ముఖ్యంగా నందమూరి అనగానే అందరికీ గుర్తొచ్చేది సంస్కారం ..మర్యాదలే .
ఆ విషయంలో నందమూరి ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా . కాగా మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేశాడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. ఈ మధ్యకాలంలో ఇది ఓ ట్రెండ్ గా మారిపోయింది ఎవరైనా సరే కనిపిస్తే “హాయి ,,హౌ ఆర్ యు” అంటూ హగ్ చేసుకోవడం ..షేక్ హ్యాండ్ ఇవ్వడం చాలా కామన్ గా చూస్తున్నాం . అయితే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎవరైనా కనబడితే చేతులు జోడించి నమస్కరించాలి. అదే పద్ధతి . అయితే అదే పద్ధతిని మరోసారి అందరికీ తెలిసేలా చేశాడు నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ .
రీసెంట్గా నందమూరి ఆడపడుచు సుహాసిని కొడుకు పెళ్లి గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే . దీంతో సోదరి కొడుకు వివాహం కావడంతో కళ్యాణ్‌రామ్-తారక్ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు. ఈ వేడుకకు బాలయ్య – మోక్షజ్ఞ కూడా హాజరయ్యారు . ఇదే క్రమంలో ఎన్టీఆర్ కనిపించగానే మోక్షజ్ఞ చేతులెత్తి దండం పెడుతూ నమస్కరించి మాట్లాడాడు . ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోని నందమూరి బ్లడ్ లో ఉన్న సంస్కారమే అది అని ..అందరిలాగ నేటి ట్రెండ్ ని ఫ్యాషన్ ని ఫాలో అవ్వట్లేదు మోక్షజ్ఞ అని రాబోయే కాలానికి మోక్షజ్ఞ సూపర్ స్టార్ హీరో అవుతాడు అని నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!