టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆమె తాజాగా విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొద్ది రోజులపాటు సినిమాలకు దూరమవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సమంత న్యూయార్క్ లో జరిగిన ఇండిపెండెన్స్ పరేడ్ వేడుకల్లో పాల్గొని అక్కడ బాగా ఎంజాయ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు రకరకాల ఫోటోలు.. పోజులతో వీనీల విందు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ట్రెండీ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసింది. సమంత వేసుకున్న ఈ డ్రెస్ రేటు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.డీప్ వీ నెక్‌లైన్‌తో కూడిన ఫ్రంట్ స్లిట్ ఫుల్ స్లీవ్ జాకెట్ – జర్దోసి – రేషమ్ – సీక్విన్ ఎంబ్రాయిడరీ తో అలంకరించబడిన మ్యాచింగ్ ఫలాజో ధరించింది.

ముత్యాలతో అలంకరించబడిన చోకర్ – సొగసైన గొలుసు, చెవిపోగులు ఒక జత గ్లాసెస్ తో సమంత చాలా అందంగా కనిపిస్తోంది. ఈ డ్రెస్ ను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనిత డోంగ్రీ డిజైన్ చేశారు. దీని ధర అక్షరాల 2 లక్షల 55 వేలు. సమంత వేసుకున్న ఈ డ్రెస్ ధర తెలిసి ఆమె అభిమానులు.. సోషల్ మీడియా ఫాలోవర్లు షాక్ అవుతున్నారు. అయితే సమంత ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉందంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సమంత ఈ లుక్‌లో చాలా స్టైలిష్ గా ఉంది.