టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి ఎంతమంది నటులు ఎంట్రీ ఇస్తున్న గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అందరికీ ఫేవరెట్ హీరోగా మారుతున్నాడు మహేష్ బాబు. దానికి కారణం ఆయన జోవియల్ గా అందరితో కలిసి మెలిసి ఉండడమే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .
కాగా ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చిన నాని దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. నాని ఇండస్ట్రీలో హీరోగా రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసారన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే నాని మొదటి సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకున్న టైంలో హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో డైరెక్టర్ బాపు , శ్రీనువైట్ల వంటి స్టార్ దర్శకులు దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు .
రేడియో జాకీగా కూడా కొన్ని రోజులు చేశారు . అష్టాచమ్మా అనే సినిమాలో ఈయనకు హీరోగా ఆఫర్ వచ్చింది. కాగా నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సినిమాలలో మహేష్ బాబు నటించిన సినిమా కూడా ఉంది. ఆ సినిమా మరి ఏదో కాదు అర్జున్. దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి దర్శకుడుగా చేస్తున్నప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు నాని . ఈ సినిమా డైరెక్షన్ లో కూడా భాగమయ్యారుట . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అలా నాని డైరెక్షన్లో మహేష్ నటించి అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు..!!