టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ సాలిడ్ హిట్ కొట్టేందుకు పదేళ్లకు పైగా వెయిట్ చేస్తున్నాడు. అదే ఉత్సాహంతో ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ కావడంతో మెహర్ రమేష్ తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. అసలు ప్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. ఒక్కసారి మెహర్ రమేష్ పేరు చెప్పగానే అందరికీ టాలీవుడ్ లోనే భయంకరమైన డిజాస్టర్ సినిమాలు శక్తి, బిల్లా, కంత్రి, షాడో ఇప్పుడు భోళా శంకర్ గుర్తుకు వస్తాయి.
ఈ ఐదు సినిమాలలో బిల్లా మాత్రమే యావరేజ్.. మిగిలిన నాలుగు సినిమాలు ఆ హీరోల కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్లు. మెహర్ రమేష్ తొలిసారి నటుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆయన చిరంజీవి ఫ్యామిలీకి సమీప బంధువు. 2002లో మహేష్ బాబు బాబి మూవీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.
తెలుగులో డిజాస్టర్ అయిన పూరి జగన్నాథ్ – ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వీర కన్నడీగ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం మెహర్ రమేష్ కు వచ్చింది. ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే ఊపులో తెలుగులో మహేష్ నటించిన ఒక్కడు సినిమాని కన్నడలో అజయ్‌గా రీమేక్ చేసి మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు.
అలా కన్నడలో మెహర్ రమేష్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అక్కడి నుంచి తెలుగులోకి ఎంట్రి ఇచ్చి ఎన్టీఆర్ తో కంత్రి సినిమా ఆ తర్వాత వరుసగా ప్రభాస్‌తో బిల్లా, ఎన్టీఆర్ తో మరోసారి శక్తి, వెంకటేష్ తో షాడో తాజాగా భోళా శంకర్ సినిమాలు తెరకెక్కించగా అన్ని ఒకదాన్ని మించిన మరొక డిజాస్టర్ అయ్యాయి.