సాధారణంగా చిత్రపరిశ్రమలో ఒక హీరో, హీరోయిన్ చేయాల్సిన పాత్ర ఒక్కొక్కసారి మరో హీరోయిన్, హీరోకి వెళ్తుంది. అలా ఆ క్యారెక్టర్ ని మిస్ చేసుకుని ఎంతో బాధపడిన హీరో, హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వారు నో చెప్పిన ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసినప్పుడు వారికి మంచి స్టార్డం వస్తుంది. ఆసమయంలో ఎందుకు వద్దనుకున్నాం రా బాబు అంటూ బాధపడే క్షణాలు చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి.
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మీనా చేయాల్సిన ఓ పాత్రను రోజా చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది అనే విషయం చాలామందికి తెలియదు.. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇక్కడ చూద్దాం. హీరోయిన్ రోజా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగీ అందరు హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ రాజకీయాల్లో కూడా దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతుంది. అలాంటి రోజా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడిందట.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ప్రేమ తపస్సు అనే సినిమాలో ఈమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో రోజా యాక్టింగ్ బాగున్నా కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. ఆ సినిమాలో శోభనబాబు కూతురుగా ముందుగా మరో స్టార్ హీరోయిన్ మీనా అని అనుకున్నారు. ఈ సినిమాల్లో కూతురు పాత్ర చనిపోతుంది అప్పటికే మీనా స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ అందుకుంది. అలాంటి సమయంలో మీన ఈ పాత్ర చేస్తే బాగుండదని ఆమెనును తప్పించారు.
ఇక దాంతో పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాలో ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా గురువు శివప్రసాద్, పరుచూరి బ్రదర్స్ ని కలిసి ప్రేమ తపస్సు సినిమా చూడాలని చెప్పారట. అందులో రోజు యాక్టింగ్ గమనించిన వారు ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుందని భావించి సర్పయాగం సినిమాలో అవకాశం ఇచ్చారట. దాంతో రోజాకు ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. అప్పటినుంచి రోజా కి సినిమాల్లో హీరోయిన్గా వరుస అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది.