మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే… ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు కెరీర్ మొదటిలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఇండస్ట్రీ కే గాడ్ ఫాదర్ గా మారాడు. అదేవిధంగా తనతో పాటుగా తన కుటుంబ సభ్యులకు కూడా ఒక దారి చూపించి నేడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ గా, పాన్ ఇండియా స్టార్‌లుగా ఎదిగేందుకు దారి చూపాడు.
68 సంవత్సరాల వయసులో కూడా నేటితరం హీరోలకు గట్టి పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల సునామీ సృష్టిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పుడు ఏ హీరో నోట వచ్చిన ప్రధానంగా పాన్ ఇండియా సినిమాలు గురించి వస్తున్నాయి.. కానీ చిరంజీవి ఆ రోజుల్లోనే హిందీలో పలు సినిమాలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ ని కూడా షేక్ చేశాడు.
చిరు బాలీవుడ్ లో నటించిన సినిమాల్లో ప్రతి బంద్ కూడా ఒకటి.. తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ అంకుశం సినిమాకి రీమేక్ గా 1990లో ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలైంది. మొదటగా నాలుగు థియేటర్లో రీలిజ్ అయన ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్స్‌లో హౌస్ ఫుల్ బోర్డులను పెట్టించుకుంది. ఈ సినిమా ఆ రోజుల్లోనే బాలీవుడ్ లో ఫుల్ రన్ లో ఐదు కోట్లకు పైగా కలెక్షలను వసూలు చేసింది. ఆ రోజుల్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ ఫైవ్ బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది.
అలాగే ఈ సినిమాతో పాటుగా అప్పట్లో చిరంజీవి ‘ఆజ్ కా గూండా రాజ్’, జెంటిల్ మాన్ వంటి సినిమాలను కూడా బాలీవుడ్లో నటించాడు. ఈ సినిమాలు కూడా బాలీవుడ్ లో మంచి విజయం సాధించాయి. ఇదేవిధంగా బాలీవుడ్ లో చిరు సినిమాలు చేస్తూ ఉంటే నేడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారేవాడేమో కానీ ఆయన ఎక్కువగా టాలీవుడ్ నే నమ్ముకుని ఇక్కడే వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ కే గాడ్ ఫాదర్గా నిలిచాడు.