సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీలో హీరోలే రాజ్యమేలేస్తున్న టైంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటు గుర్తింపు సంపాదించుకుని లేడి ఓరియంటెడ్ ఫీలిం చేసి హిట్ అందుకున్న ఏకైక హీరోయిన్ నయనతారఅనే చెప్పాలి . అప్పట్లో మహానటి సావిత్రి తర్వాత సౌందర్య తర్వాత ఇప్పుడు ఈ కాలానికి ఈ జనరేషన్ కి నయనతార నే అలాంటి ఓ మహానటి అంటున్నారు జనాలు . కోలీవుడ్ మహానటి గా పాపులారిటి సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ టాప్ పోజీషన్ లో ఉంది.
రీసెంట్ గానే కొలివుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న నయనతారకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. స్టార్టింగ్ లో చిన్నా చితకా పాత్రలు చేసిన నయనతార ఇప్పుడు క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది . ఒక్కొక్క సినిమాకి పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . ఈ క్రమంలోనే ఆమె కు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అనేది వైరల్ గా మారింది . ఇప్పటివరకు నయనతార 260 కోట్లకు పైగానే ఆస్తులు సమకూర్చినట్లు సమాచారం అందుతుంది .
అంతేకాదు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ జెట్ ని కూడా కొనుగోలు చేసిందట. మొదటి నుంచి డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే నయనతార హైదరాబాద్ – చెన్నై – కేరళ వంటి ఊర్లలో సొంత భవనాలు ఫ్లాట్లు బిజినెస్ లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్గా రాణిస్తూనే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె సినిమాలో వచ్చేదానికి డబల్ రేంజ్ లో సంపాదిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ ను పెళ్లి చేసుకున్న ఈమె ఆ తర్వాత మరింత స్థాయిలో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది, అయితే తన భర్త విగ్నేశ్ శివన్ కంటే నయనతార ఆస్తి ఎక్కువగా ఉంది. విగ్నేశ్ శివన్ ఆస్తి తిప్పి తిప్పి కొట్టిన 50 కోట్లకు మించి ఉండదు. నయనతార ఆస్తి మాత్రం ఏకంగా 260 కోట్లకు పైగానే తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!