మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా భోళా శంకర్. భారీ అంచనాల మధ్య ఈనెల 11న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం బారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. దాదాపు రు. 110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అందులో 20 శాతం కలెక్షన్లు కూడా రాబట్ట లేకపోయింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఇప్పటికి కనీసం రు. 30 కోట్ల షేర్ కూడా రాలేదు. ఎప్పటికే చాలా చోట్ల ఈ సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. ఇక ఈ సినిమాకు ఏకంగా రు. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ఈ సినిమాకు రు. 50 కోట్లకు పైగా భారీ నష్టాలు తప్పేలా లేవు. సినిమా రిలీజ్ ఇప్పటికే 10 రోజులు దాటింది.
పైగా తొలి రోజు నుంచి నెగటివ్ టాక్ రావడంతో అన్ని థియేటర్లలో ఈ సినిమాను తీసేసారు. ఇక ఈ సినిమా నిర్మించిన అనిల్ సుంకర ఈ సినిమా ఓటిటి రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మారు. చిరు సంక్రాంతికి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఓటిటి రైట్స్ కూడా నెట్ ఫిక్స్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే భోళాశంకర్ సినిమాకు కూడా ఏకంగా రు. 30 కోట్లు చెల్లించి ఓటిటి హక్కులు కొనుగోలు చేసింది.
వాస్తవంగా సినిమా విడుదలలేక 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారట. అయితే సినిమా అనుకున్న దానికంటే ఘోరంగా డిజాస్టర్ కావడంతో చాలా త్వరగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో భోళాశంకర్ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం.