టాలీవుడ్ లో అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దిల్ రాజు అసలు పేరు బి వెంకట రమణారెడ్డి. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా నార్సింగ్‌పల్లి. నైజాంలో ముందు డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఆ తర్వాత 2003లో నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఆ సినిమాతోనే తన పేరుని దిల్ రాజుగా మార్చుకున్నారు. అక్కడ నుంచి ఆయన టాలీవుడ్ లో తిరిగేలేని నిర్మాత, నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయారు. ఇక దిల్ రాజు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఆయన భార్య అనిత దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవళ్లతో ఆడుకుంటోన్న వేళ దిల్ రాజు జీవితంలో తీరని విషాదం చోటు చేసుకుంది.
2017 లో దిల్ రాజు అమెరికాలో ఉండగా అనిత గుండెపోటుతో మృతి చెందారు. అయితే 49 సంవత్సరాల వయసులో భార్య చనిపోవడంతో దిల్ రాజు కాస్త డిప్రెషన్ లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే దిల్ రాజు కుమార్తె ఎలాగైనా తన తండ్రికి ఈ వయసులో ఒక తోడు కావాలని ఒప్పించి రెండో వివాహం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక కూతురు మాట కాదనలేక దిల్ రాజు రెండో వివాహానికి అతి కష్టం మీద ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ఫ్లైట్లో జర్నీ చేస్తున్న క్రమంలో తేజస్వినితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని రాజు నిశ్చయించుకున్నారు.
కరోనా సమయంలోనే 2020 మెలో తన సొంత ఊరు నిజామాబాద్ జిల్లాలోని నార్సింగ్‌పల్లి లో వెంకటేశ్వర స్వామి గుడిలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో దిల్ రాజు – తేజస్విని వివాహం జరిగింది. ఇక దిల్ రాజు భార్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె ఒక ఎయిర్ హోస్ట్. దిల్ రాజు కంటే వయసులో దాదాపు 15 సంవత్సరాలకు పైగా చిన్న అమ్మాయి. దిల్ రాజుకు ఇది రెండో వివాహం అయిన తేజస్వి నీకు మాత్రం మొదటి వివాహం. ఇక దిల్ రాజు – తేజస్విని దంపతులకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. ఇక తేజస్విని బాగా చదువుకున్న అమ్మాయి.. ఆమె భర్తను మంచిన తెలివితేటలతో ఉంటుందని ఇండస్ట్రీలో రాజు ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్లు చెప్పుకునే మాట..!