తెలుగు సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది కృతికర్బంద. పవన్ కళ్యాణ్ – త్రిష జంటగా నటించిన తీన్మార్ సినిమాలో కృతికర్బంగా కూడా ఒక హీరోయిన్. ఆ తర్వాత తెలుగులో రామ్ ఒంగోలు గిత్త సినిమాతో పాటు అడపాదడపా కొన్ని సినిమాలు చేసిన అవేవీ ఆమెను ఇక్కడ స్టార్ హీరోయిన్గా నిలబెట్టలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగులోనే మెగా హీరో రామ్ చరణ్ బ్రూస్‌లీ సినిమాలో హీరోకు చెల్లి పాత్రలో నటించింది.
అయితే తన కెరీర్ ప్రారంభంలో తనకు కలిగిన ఒక చేదు అనుభవాన్ని తాజాగా ఆమె పంచుకుంది. తాను ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో తన గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టారని.. తనకు చాలా భయమేసిందని కృతి చెప్పుకొచ్చింది. ఢిల్లీ బ్యూటీ అయిన కృతి తెలుగులో బోణీ సినిమాతో నటిగా కెరియర్ ప్రారంభించింది. కెరీర్ తొలినాలలో ఎక్కువగా దక్షిణాది సినిమాల్లోనే నటించింది.
తెలుగుతో పాటు కన్నడంలో కూడా చాలా సినిమాలు చేసింది. తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక బ్రూస్‌లీ సినిమా తర్వాత ఆమె తెలుగు సినిమాలకు పూర్తి దూరంగా ఉంది. ఇక బాలీవుడ్ లోనూ రెండేళ్లుగా ఎలాంటి సినిమాలు చేయలేదు. అయితే కెరీర్ ప్రారంభంలో కన్నడ సినిమాలో నటిస్తుండగా తాను ఉన్న గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టారని.. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి సీక్రెట్ గా నా రూమ్ లో కెమెరా పెట్టారని చెప్పింది.
అయితే తాను స్టేజ్ చేసే రూమ్ చెక్ చేసుకోవటం నాకు.. నా టీంకు అలవాటు అని అలా గదిని మొత్తం పరిశీలించగా సెటప్ బాక్స్ వెనకాల కెమెరా గుర్తించాం.. నేను పర్సనల్‌గా ఉండగా వీడియోలు రికార్డ్ చేసేందుకే అది పెట్టారని… అది చూసి చాలా షాక్ అయ్యానని.. అప్పటినుంచి ఎక్కడైనా బసచేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని కృతి చెప్పింది.