మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అటు తన తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించడంతోపాటు ఇటు నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే శ్రీదేవి శోభన్ బాబు సినిమా నిర్మించగా ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు తన తండ్రితో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తోంది. కురసాల కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు.
చిరంజీవి సైతం తన కుమార్తెను నిర్మాతగా నిలబెట్టేందుకు బయట నిర్మాతల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా.. వారిని కాదనుకుని మరి కూతురు కోసం సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుస్మిత దివంగత క్రేజీ హీరో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ 20 సంవత్సరాలు క్రితం ఒక సెన్షేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో వరుస హిట్లతో ఉన్న ఉదయ్ కిరణ్ ను చిరంజీవి తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగటం ఇండస్ట్రీ వర్గాల్లో హైలైట్ అయింది.
ముందుగా సుస్మిత ఉదయ్ కిరణ్ ను ఇష్టపడింది. అట ఉదయ్ కిరణ్ తో కలిసి ఒక సినిమాలో నటించాలని కూడా సుస్మిత అనుకుంది. అయితే చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అలా రీల్ లైఫ్ లో వీరిద్దరూ జంటగా నటించాలని కోవటం కుదరకపోయినా.. రియల్ లైఫ్ లో మాత్రం భార్యాభర్తలు అవ్వాలనుకున్నారు. స్వయంగా చిరంజీవి పెళ్లి సంబంధం కుదుర్చుకోవటానికి ఉదయ్ కిరణ్ వద్దకు వచ్చారు.
తర్వాత ఎంగేజ్మెంట్ జరిగాక అనుకోని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది. తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ పూర్తిగా డౌన్ అవ్వటం.. చివరకు అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం జరిగిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఈ సంఘటన జరిగి 20 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పుడు ఇలా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూనే వస్తోంది.