టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతను ఓ డైరెక్టర్ బలవంతం చేశారా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఆయన మరెవరో కాదు శివ నిర్వాణ. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత శివనిర్వాణ డైరెక్షన్లో “మజిలీ” అనే సినిమాలో నటించింది . ఈ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .
తర్వాత మళ్లీ సమంత -శివ నిర్వాణ కాంబోలో “ఖుషి” అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు మూవీ టీం. అయితే సమంత అమెరికాలో ఉన్నా కానీ సినిమాకు మంచి బజ్ ని క్రియేట్ చేస్తుంది. కాగా రీసెంట్గా ఖుషి సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్-సామ్ మధ్య రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించేసాడు డైరెక్టర్.
అయితే ఈ సినిమాలో సమంతను విజయ్ దేవరకొండ బ్యాక్ నుంచి హగ్ చేసుకోవడం ..ఆమెతో బెడ్ సీన్స్ షేర్ చేసుకోవడం సమంత కి ఇష్టం లేదట. ముందు ఈ సీన్స్ కి యాక్సెప్ట్ చేయలేదట. కథ వివరించేటప్పుడు ఇలాంటి సీన్స్ చెప్పలేదు అంటూ మొండిగా చేయనంటే చేయను అంటూ షూటింగ్ నుంచి వెళ్లిపోయేంత పని చేసిందట. అయితే డైరెక్టర్ ఆమెను ఒప్పించి మరి ఈ సీన్స్ ఈ సినిమాకి కీలకమని ఓ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి రొమాంటిక్ సీన్స్ పెట్టాలి అని ఒప్పించి మరి ఆమె చేత ఈ సీన్స్ చేయించారట , ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!