Moviesసమంత అమెరికా వెళ్లింది ట్రీట్ మెంట్ కి కాదా..? అందుకేనా..? ఫోటోలతో...

సమంత అమెరికా వెళ్లింది ట్రీట్ మెంట్ కి కాదా..? అందుకేనా..? ఫోటోలతో బయటపడిన నిజం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సమంత అమెరికా వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం కాదా..? హాలీవుడ్ సినిమాల కోసమా..? అంటే అవునని అనిపిస్తుంది అంటున్నారు అభిమానులు . సమంత మయోసైటీస్ తో బాధపడుతుందని.. ఆ వ్యాధి మళ్ళీ తిరగబడిందని.. ఆ వ్యాధి కోసం అమెరికా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్లిందని.. ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే అమెరికా వెళ్లిన సమంత డాక్టర్లను కలవకపోగా సినిమా స్టూడియోలు చుట్టూ తిరుగుతూ రకరకాల ఫోటోషూట్ చేసి ట్రెండింగ్ లోకి వచ్చింది.

రీసెంట్గా సమంత అమెరికా టూర్ లో భాగంగా ఫేమస్ హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ వార్నర్ బ్రదర్ స్టూడియోస్ సందర్శించింది . దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది . అలాగే వార్నర్ బ్రదర్ స్టూడియోస్ తో పాటు కాలిఫోర్నియాలోని ప్లేవరీ హిల్స్ లో సమంత దిగ్గిన ఫోటోలు చెక్కర్లు కొట్టడం విశేషం . ఇవన్నీ హాలీవుడ్ సంబంధిత ప్రాంతాలు కావడంతో సమంత హాలీవుడ్లో ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వబోతుందా అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి .

అంతేకాదు హాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇప్పటికే సమంత కొన్ని సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చిందని.. హాలీవుడ్ రేంజ్ లో ఏకంగా రెండు బడా ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసిందని చెప్పుకొస్తున్నారు. అయితే ట్రీట్మెంట్ పేరుతో అమెరికా అంటూ ఖుషీ సినిమా ప్రమోషన్స్ ఎగ్గొట్టిన సమంత అమెరికాకి వెళ్లి కొత్త సినిమాలకు సైన్ చేస్తుంది అ అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news