Moviesనగ్మాకి ఇన్నాళ్లకి ఆ మూడ్ వచ్చిందా..? 48 వయసులో పెళ్లి చేసుకుని...

నగ్మాకి ఇన్నాళ్లకి ఆ మూడ్ వచ్చిందా..? 48 వయసులో పెళ్లి చేసుకుని ఏం పికుతుందట..?

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు . అయితే కొంతమందికి ఆ ముచ్చట చాలా ఆలస్యంగా జరగొచ్చు . ఎంత ఆలస్యంగా అంటే అమ్మమ్మ కావాల్సిన వయసులో అమ్మ అవ్వాలి అని ఆశపడడం . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సీనియర్ హీరోయిన్ నగ్మ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ విషయాన్ని ఆమె ప్రకటించడం గమనార్హం .

కాగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో అలరించిన నగ్మా 2008 నుంచి సినిమాలు మానేసినప్పటికీ అప్పుడప్పుడు తన ఎఫైర్ వార్తలు కారణంగా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది . కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నగ్మా తనకు పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది అంటూ చెప్పుకు వచ్చింది. దీనితో ఈ బ్యూటీ పేరు మరోసారి వైరల్ గా మారింది. కాగా ఆల్రెడీ నగ్మా క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ నడిపింది అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి.

అలాగే భోజ్పురి నటుడు రవికిషన్ తో కూడా నగ్మా లవ్ ట్రాక్ నడిపినట్లు వార్తలు వైరల్ అయ్యాయి . అంతేకాకుండా శరత్ కుమార్ తో సైతం ఎఫైలు నడిపినట్లు తెగ ప్రచారం జరిగింది. ఇదంతా పక్కన పెడితే పెళ్లైన హీరోలతో లవ్ ట్రాక్ నడిపిన నగ్మా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ త్వరలోనే చెప్పబోతున్నట్లు ప్రకటించింది . “పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది. పెళ్లి చేసుకుంటే పిల్లలు నాకంటూ ఓ తోడుగా ఓ ఫ్యామిలీ ఉంటుంది ..ఏమో చెప్పలేను .. ఒకవేళ నిజంగా త్వరలో నేను పెళ్లి చేసుకుంటానేమో గుడ్ న్యూస్ మీరు వింటారేమో” అంటూ హింట్ ఇచ్చేసింది .దీనితో నగ్మా పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారింది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news