Moviesచరణ్ ని తొక్కేయాడానికి అల్లు అరవింద్ అలాంటి పనులు చేసాడా..? అల్లు...

చరణ్ ని తొక్కేయాడానికి అల్లు అరవింద్ అలాంటి పనులు చేసాడా..? అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేసాడా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు వ్శ్ మెగా ఫైట్ ఎలా పీక్స్ కి చేరుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ బాగానే ఉన్నా.. కానీ మధ్యలో జనాలు కొట్టుకొని చచ్చిపోతున్నారు . వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని వీళ్ళే ఊహించుకొని రచ్చ రంబోలా క్రియేట్ చేస్తున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ల పద్ధతి కూడా అలాగే ఉండడంతో జనాలు వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అని..వీళ్ళ మధ్య ఇన్నర్ ఫైట్ జరుగుతుంది అంటూ ఇంకా రెచ్చిపోతున్నారు .

అయితే గతంలో అల్లు అరవింద్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ ని తొక్కేయడానికి అలాంటి పనులను చేసాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. మనకు తెలిసిందే అల్లు అరవింద్ ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ . ఏ సినిమా అయినా ఆయన చేతికి వెళ్లితే పెట్టిన దానికి ట్రిపుల్ లాభాలు సంపాదించుకునే సత్తా ఉన్న డైరెక్టర్ . అయితే ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరంగేట్రం చేసిన చిరుత మూవీ చూసిన జనాలు ఆ తర్వాత చిరంజీవిని మరిపించే స్థాయికి చరణ్ వెళ్తాడు అని అప్పట్లో కామెంట్స్ చేశారు .

అయితే ఈ కామెంట్స్ సీరియస్ గా తీసుకున్నారట అల్లు అరవింద్ . తన కొడుకు బన్నీ కన్నా చిరంజీవి కొడుకు టాప్ కి వెళ్లిపోతున్నాడని..ఆయన కెరీర్ ఎలాగైనా తొక్కేయాలని అల్లు అర్జున్ టాప్ పొజిషన్లోకి వెళ్లాలని ఆయన వద్దకు వచ్చిన చరణ్ కథలు అన్నీ కూడా అల్లు అర్జున్ తో చేసే విధంగా డైరెక్టర్స్ ని మాటలతో మాయ చేసేవాడట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమా సైతం అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కడానికి సిద్ధమైనప్పుడు..

చరణ్ ఈ సినిమాలో హీరో కాకుండా అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తే బాగుంటుంది అంటూ రాజమౌళిని తెగ ఇబ్బంది పెట్టారట . అయితే మేటర్ లోకి ఇన్వాల్వ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత రామ్ చరణ్ ఈ సినిమా చేసే విధంగా కూల్ గా మ్యాటర్ సాల్వ్ చేసుకున్నారట . ఆ తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కి ఇది తెలిసి చాలా సార్లు నాన్న కు పరోక్షకంగా వద్దు అని చెప్పేసేవాడట. కానీ కొడుకు మీద ప్రేమతో ఆయన అల్లు అర్జున్ కే తెలియకుండా ఇలా చేసేవాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news