టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్తే వచ్చే కిక్కే వేరు . ఇండస్ట్రీకి స్టైల్ ని పరిచయం చేసింది చిరంజీవి ..అయితే ఆ స్టైల్ ని కంటిన్యూ చేస్తుంది అల్లు అర్జున్ అనె చెప్పాలి. జనాల్లో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన వేసే డ్యాన్స్ స్టెప్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ అభిమానులకి మంచి కిక్కిస్తూ ఉంటాడు .
ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకోవడమే కాకుండా.. గ్లోబల్ స్థాయి రికార్డులను కొల్లగొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది . సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు అల్లు అర్జున్ వేరే జాబ్ చేసేవాడట .
అల్లు అర్జున్ కు యానిమేటర్, డిజైనర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదట. ఈ నేపథ్యంలోనే మొదట్లో ఇంటర్న్ ఫ్యాషన్ డిజైనర్‍గా వర్క్ చేశాడు. ఆ టైమ్ లో అల్లు అర్జున్ కు రూ.3500 ఇచ్చేవారట. ఆ శాలరీ కూడా అప్పట్లో డాన్స్ కోసమే ఖర్చు చేశాడట అల్లు అర్జున్ . దీంతో ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి డాన్స్ అంటే ఎంత ఇష్టమో అంటూ పొగిడేస్తున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది..!!