Moviesక్రేజీ రికార్డ్: ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో అలా చేసిన హీరో...

క్రేజీ రికార్డ్: ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో అలా చేసిన హీరో అక్కినేని నాగార్జున మాత్రమే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు .. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని.. ఆస్కార్ అవార్డులను సైతం అందుకొని ఉండొచ్చు కానీ అందరి హీరోలకి దక్కని అదృష్టం అక్కినేని నాగార్జునకు దక్కింది . ప్రజెంట్ అదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున పుట్టినరోజు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు.. ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా.. అక్కినేనికి నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అంతేకాదు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున నుంచి రెండు క్రేజీ అప్డేట్స్ వచ్చాయి . ఆయన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 99వ సినిమాని కొత్త డైరెక్టర్ తో చేయబోతున్నాడు . ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు . నా స్వామి రంగా అంటూ టైటిల్ కూడా పెట్టుకోచ్చారు. అంతేకాకుండా ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబోలో సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు నాగార్జున అంటూ అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది చిత్ర బృందం.

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు మాత్రమే దక్కిన క్రేజీ రికార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . తెలుగులో ఎంతోమంది హీరోలు తమ తండ్రితో లేదా కొడుకులతో లేదా భార్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . కానీ ఇండస్ట్రీలో ఉండే ఒకే ఒక్క హీరో మాత్రం తండ్రి కొడుకులు మరియు భార్యతో నటించిన ఏకైక హీరో నాగార్జున మాత్రమే ఈ అరుదైన అదృష్టం ఆయనకు మాత్రమే దక్కింది. అక్కినేని ఫ్యామిలీ మొత్తం భాగం అయిన సినిమా మనం ఇందులో నాగార్జున – నాగచైతన్య – అక్కినేని నాగేశ్వరరావు – అఖిల్ మరి అమలా కూడా ఈ మూవీలో భాగమయ్యారు . 2014లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టుగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు అక్కినేని ఇంటికి కోడలు సమంత కూడా పెళ్లి కాకముందే ఈ సినిమాలో నటించి క్రేజీ రికార్డు నెలకొల్పింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news