తెలుగు సినిమాల్లో ఎవరికి వారై.. నటించినా.. తమకంటూ కొన్ని తరాల పాటు నిలిచిపోయే పేరును.. ఆస్థిని కూడా కూడగట్టుకున్నారు .. ఛాయాదేవి. సూర్యాకాంతం. ఇద్దరూ కూడా అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వారే. పైగా.. నాన్ వెజ్ ముట్టుకునేవారు కాదు. అయితే.. ఇద్దరిలోనూ .. ఛాయాదేవి ముందుగా.. సినీ రంగ ప్రవేశం చేశారు. పౌరాణికాల సమయంలోనే ఛాయాదేవి మంచి పేరు తెచ్చుకున్నారు.
మయాబజార్ సినిమాలో ఛాయాదేవి నటనకు.. ప్రేక్షకులు మురిసిపోయారు. ఇదే సినిమాలో సూర్యాకాంతం కూడా నటించారు. ఘటోత్కచుని తల్లి పాత్రలో సూర్యాకాంతం మెరిసిపోయారు. అప్పటికి అదే కొత్తగా సూర్యాకాంతం ఎంట్రీ ఇచ్చారు. ఈ పాత్రలో ఎస్వీరంగారావుకు ఆమె మాతృమూర్తి. నిజానికి ఇద్దరి మధ్య వయసు తేడా 12 ఏళ్లు. రంగారావు కంటే.. సూర్యాకాంతం 12 ఏళ్ల చిన్న నటి.
అయినా కూడా.. దర్శకుడు పట్టుబట్టి సూర్యాకాంతంతో ఈ వేషం వేయించారు. ఏదో ఒకటిలే.. దక్కిందే దక్కుదల అంటూ.. సూర్యాకాంతం నటించారు. నాలుగు సీన్లలో మాత్రమే నటించిన సూర్యాకాంతానికి ఈ సినిమాలో రెండే డైలాగులు.. తగదంటిని కదకుమారా..! అనే డైలాగు తప్ప.. ఇంకేమీ లేవు. ఇక, ఛాయాదేవి కూడా ఈ సినిమాలో నటించారు. అయితే.. ఇద్దరూ కూడా ఉద్ధండ నటులే కావడం గమనార్హం.
కేవలం సింగిల్ టేక్‌తోనే సూర్యాకాంతం.. ఛాయాదేవిలు.. షూటింగ్ చేసేవారు. నిజానికి సూర్యాకాంతం కొత్తకావడంతో ఒకటి రెండు టేకులైనా పడతాయని దర్శకులు లెక్కలు వేసుకునేవారు. అయితే.. దీనికి భిన్నంగా సూర్యాకాంతం.. కొత్తే అయినప్పటికీ.. ఛాయాదేవితో పోటీ పడి మరీ.. తానేం తక్కువ కాదన్న పంతం వేసి సింగిల్ టేక్‌కే పరిమితం అయ్యేవారు. ఇది.. తర్వాత కాలంలో సూర్యాకాంతానికి ఎంతో మేలు చేసింది.