పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయిలో వచ్చిన సినిమా బ్రో
. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించడం.. మాతృకను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో కూడా డైరెక్ట్ చేయడంతో అక్కడ మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందనే అందరూ అనుకున్నారు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరవెనక అంతా తానై నడిపించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలకు కూడా అందించారు. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేసినా సగటు సినీ అభిమానులకు పెద్దగా నచ్చలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఆగిపోయింది.
బ్రో బాక్సాఫీస్ వద్ద రు. 97 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. పవన్ క్రేజ్‌కు తోడు.. సినిమాలో సాయిధరమ్ కూడా ఉండడంతో ఇది పెద్ద టార్గెట్ కాదనే అందరూ అనుకున్నారు. అయితే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి బ్రో ఏపీ, తెలంగాణలో కేవలం రూ. 50.71 కోట్ల షేర్, రూ. 79.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 63.21 కోట్ల షేర్, రూ. 105.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ. 35.29 కోట్ల షేర్ దక్కించుకోవాల్సి ఉంది. అయితే ఫస్ట్ వీక్ ముగిసే సరికే బాక్సాఫీస్ దగ్గర బ్రో పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడున్న రన్‌తో అసలు ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల బ్రో ఎత్తేసి బేబి మూవీ ప్రదర్శిస్తున్నారు.