Moviesబిగ్ అనౌన్స్మెంట్: రౌడి హీరో పెళ్లి చేసుకోబోతున్నాడోచ్.. విజయ్ దేవరకొండ లెటేస్ట్...

బిగ్ అనౌన్స్మెంట్: రౌడి హీరో పెళ్లి చేసుకోబోతున్నాడోచ్.. విజయ్ దేవరకొండ లెటేస్ట్ పోస్ట్ వైరల్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి లేకపోతున్నారా..? అంటే ఆయన తాజా పోస్ట్ ద్వారా అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన తాజాగా నటించిన సినిమా ఖుషి సెప్టెంబర్ 1న సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది .

ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ అమ్మాయి “చేయి పట్టుకొని త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్” అంటూ ఓ క్రేజీ న్యూస్ చెప్పారు. అయితే ఇది విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా గురించి నా లేక ..? తన లైఫ్లో వేయబోయే నెక్స్ట్ స్టెప్ గురించా..? అనేది అభిమానులకు అర్థం కావడం లేదు.

చాలామంది ఈ ఫోటోలో ఉండే చేయి రష్మిక మందనది అని త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని విజయ్ దేవరకొండ పెళ్లి పీటలు లేకపోతున్నారు అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఆయన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించి ఉంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ మేటర్ ఏంటో తెలియాలి అంటే విజయ్ దేవరకొండ నోరు విప్పాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news