ఈ టైటిల్ నూటికి నూరు శాతం నిజం. భోళాశంకర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి తనకు కావలసిన వాళ్లకు పెట్టిన ఒక ఉపాధి పథకం. ఈ సినిమా చూశాక నిజంగానే ఈ సినిమా హిట్ అవ్వాలని.. నిర్మాతకు లాభాలు రావాలని తీశారా ? లేదా తమ కడుపు నింపుకోవడానికి తన రెమ్యరేషన్ తనకు వస్తే చాలు.. ఎవరు ఎలా పోతే తనకే అన్నట్టుగా తీశారా ? అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి.
చిరంజీవి డేట్లు కావాలని నిర్మాత అనిల్ సుంకర అడిగారు. చిరు కాస్త తట పటాయించారు చూద్దాం అన్నాడు. వెంటనే అనిల్ సుంకర రు. 65 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడు. ఇంకేముంది చిరు డేట్లు ఇచ్చేశాడు. కథ, డైరెక్టర్ కావాలి కదా.. స్వయంగా వేదాళం సినిమా రీమిక్స్ చేద్దామని సూచనలు చేశాడు. పైగా తన సమీప బంధువు మెహర్ రమేష్‌ను కూడా పిలిచి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేశాడు. అందులోను భయంకరమైన డిజాస్టర్లతో పదేళ్ల నుంచి టాలీవుడ్ లో కనీసం చిన్నాచితకా హీరోలు కూడా దగ్గరికి రానివ్వని మెహర్‌ను పిలిచి తానే స్వయంగా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేశాడు.
అలా చిరు డబ్బులు చిరుకు ముట్టాయి. ఎవరు దగ్గరకు రానివని మెహర్ రమేష్ కు కూడా మంచి ఉపాధి హామీ పథకంతో ఈ సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఎప్పటినుంచో చిరు అభిమానులం అంటూ భజన చేసే జబర్దస్త్ గ్యాంగ్ అందరికీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చేశారు. జబర్దస్త్ రష్మీ. హాట్ యాంకర్ శ్రీముఖి, బిత్తిరి సత్తి, హైపర్ ఆది ఇలా చెప్పుకుంటూ పోతే జబర్దస్త్ ఆర్టిస్టులకు చాలామందికి ఛాన్స్ ఇచ్చి వాళ్లకి కూడా మెగాస్టార్ సినిమాలో అవకాశం ఇచ్చామని గొప్పలకు పోయారు. వాళ్లకు కూడా భోలాశంకర్ మంచి ఉపాధి హామీ పథకంలా దొరికింది. ఎవరి డబ్బులు వాళ్లకు ముట్టాయి. చివరకు నిర్మాత అనిల్ సుంకర ఘోరంగా నష్టపోయారు.
ఓవైపు ఏజెంట్ డిజాస్టర్ తో బాధపడుతున్న ఆయన ఈ సినిమాతో మరింతగా పాతాళంలోకి వెళ్లిపోయినట్టు అయింది. భోళాశంకర్‌కు పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా వచ్చింది. 60 ఏళ్ళు దాటిన తర్వాత రజనీకాంత్ విక్రమ్ సినిమాతో, కమలహాసన్ ఎలాంటి ? పాత్రలు చేస్తున్నారో ఇప్పటికే అయిన చిరంజీవి వాళ్ళను చూసి నేర్చుకోవాలన్న చురకలు పడుతున్నాయి. అయినా చిరంజీవిలో ఇంకా మార్పు కనపడటం లేదు. ఇంకా హీరోయిన్లతో రొమాన్స్ చేయాలి అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇంకా హీరోయిజం ఎలివేట్ చేసే కథలే ఆయన కోరుకుంటున్నారు. ఆచార్య – గాడ్ ఫాదర్ – వాల్తేరు వీరయ్య – భోళాశంకర్ అంతకు ముందు సైరా ఈ ఐదు సినిమాలలో వాల్తేరు వీరయ్య తప్ప అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య కూడా రొటీన్ మాస్ మసాలా సినిమా. అయినా బాబీ టేకింగ్ తో పాటు రవితేజ సెంటిమెంట్ కాస్త వర్క్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఎలాగోలా గట్టెక్కింది. ఏది ఏమైనా భోళాశంకర్ లాంటి మంచి ఉపాధి హామీ పథకంతో అందరి కడుపులు నిండాయి కానీ.. అందరూ కలిసి నిర్మాత అనిల్ సుంకర కడుపు కొట్టేశారు.