మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డారు. ఈ సినిమా చిరు కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయింది. తాజాగా మోకాలికి చిన్న సర్జరీ చేయించుకున్న చిరంజీవి కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. భోళా శంకర్ సినిమా చిరంజీవికి పరువు తీసేసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవి గత కొన్ని దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలలో సూపర్ హిట్ సినిమాలు.. బ్లాక్ బస్టర్లు అలాగే డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే రీ ఎంట్రీ తర్వాత ఆయన తన స్థాయికి తగినట్టుగా సత్తా చూపలేకపోతున్నారు. ఆచార్య – గాడ్ ఫాదర్ – భోళాశంకర్ సినిమాలు ప్లాప్ కావడంతో పాటు విపరీతమైన ట్రోల్లింగ్ కు గురయ్యాయి. దీనికి తోడు చిరు వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఇలా వరుసగా రీమేక్ సినిమాలు దెబ్బకొడుతూ ఉండడంతో చిరంజీవి ఇకపై రీమేక్ సినిమాలు చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మళయాళ హిట్ సినిమా బ్రో డాడీ రీమేక్ చేయాలని చిరంజీవి ముందుగా నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే భోళాశంకర్ దారుణంగా బోల్తా పడిందో చిరంజీవి ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
తన కెరీర్లో ఇకపై అస్సలు రీమిక్స్ సినిమాలు జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బ్రోడాడీ సినిమాను కూడా పక్కన పెట్టేసారట. దీనిని బట్టి చూస్తుంటే చిరంజీవి కాస్త లేట్ అయినా కూడా ఇకపై స్ట్రైట్ సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.