Newsభోళా ఎఫెక్ట్‌... చిరంజీవి రెమ్యున‌రేష‌న్లో భారీ కోత‌లు... లాభం ఎవ‌రికంటే...!

భోళా ఎఫెక్ట్‌… చిరంజీవి రెమ్యున‌రేష‌న్లో భారీ కోత‌లు… లాభం ఎవ‌రికంటే…!

రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత కరోనా సమయం వదిలేస్తే.. ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ వస్తున్నారు. సైరా తర్వాత గత ఏడాది ఆచార్య – గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిరు ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, తాజాగా భోళాశంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే చిరు రీయంట్రీ తర్వాత ఎక్కువగా రీమేక్‌ సినిమాలు చేస్తున్నా అవి సరైన ఫలితం ఇవ్వటం లేదు. గాడ్ ఫాదర్ – భోళాశంకర్ సినిమాలు అయితే పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఇక తాజాగా చిరంజీవి రెమ్యూనరేషన్ విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. భోళాశంకర్ డిజాస్టర్ అయింది. ఈ సినిమా కోసం చిరంజీవి ఏకంగా రు. 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నట్టు తెలిసిందే.

ఆచార్య సినిమాకు చిరంజీవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్నది క్లారిటీ లేదు. సినిమా డిజాస్టర్ అవడంతో తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని ఆయన వెనక్కు ఇచ్చేసారని సమాచారం. ఇక గాడ్ ఫాదర్ సినిమాకు 55 కోట్లు తీసుకున్న చిరంజీవి ఆ సినిమా సరిగా మార్కెట్ కాక ఆడక పోవడంతో వాల్తేరు వీర‌య్య‌కు రు. 50 కోట్లు మాత్రమే తీసుకున్నారు. అయితే వాల్తేరు వీరయ్య రు. 140 కోట్లకు పైగా షేర్ రాబట్టడంతో పెరిగిన మార్కెట్ నేపథ్యంలో భోళాశంకర్ సినిమా కోసం ఏకంగా 65 కోట్లు పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. కనీసం రు. 25 కోట్ల షేర్ వస్తుందా రాదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ చిరంజీవి తర్వాత సినిమా రెమ్యూనిరేషన్ పై ఖచ్చితంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చిరంజీవి తర్వాత సినిమాను నిర్మిస్తోంది ఎవరో ? కాదు చిరు పెద్ద కుమార్తె కోణిదెల సుష్మిత కావటం విశేషం. ఈ సినిమాకు కురసాల కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి రెమ్యూనరేషన్ తగ్గటం అంటే అది చిరు కుమార్తెకే ఫ్ల‌స్‌కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news