చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే అటు చిరంజీవితో పాటు ఇటు దర్శకుడు మెహర్ రమేష్ మీద భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ కావడంతో చిరు భోళా శంకర్ సినిమాకు రు. 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని.. దీనికి తోడు అనిల్ సుంకర్ కి మరో ఐదు కోట్లు అదనపు ఖర్చులు అయ్యాయని.. ఇలా ఓవరాల్ గా చిరంజీవికి రు. 70 కోట్లు ముట్టాయంటూ ఒకటే ప్రచారం జరిగింది. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.
అనిల్ సుంకర ఈ సినిమా మీద ఏకంగా రు. 50 కోట్లకు పైగా నష్టపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత ఇంత నష్టాల్లో ఉంటే చిరంజీవి కనీస సాయం కూడా చేయలేదంటూ కొందరు ఆయనను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి రు. 10 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి అడిగినట్టుగా రు. 55 కోట్ల రెమ్యూనరేషన్ నగదు రూపంలో చెల్లింపులు చేసినా అనిల్ సుంకర మరో రు. 10 కోట్లకు ఒక చెక్ ఇచ్చారని తెలుస్తోంది.
అంతే సినిమా రిలీజ్ అయిన నాలుగో రోజు బ్యాంకుకు ఆ చెక్ ప్రజెంట్ చేయమని అనిల్ సుంకర హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సినిమా రిజల్ట్ ఏంటి ? అనేది మార్నింగ్ షోకే తెలిసిపోయింది. సాయంత్రం వరకు చూసిన మెగాస్టార్‌కు నిర్మాత సమస్యలు అర్థం అయ్యాయి. దీంతో తాను బ్యాంకుకు ఆ రు. 10 కోట్ల ప్రజెంట్ చేయనని అనిల్ సుంకరకు చెప్పేసారని తెలుస్తోంది.
అంటే చిరంజీవి రు. 55 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నట్లు అన్నమాట. ఏది ఏమైనా ఉన్నంతలో నిర్మాతకు రు. 10 కోట్ల రిలీఫ్ ఇవ్వటం కాస్త బెటర్ అనుకోవాలి. భోళాశంకర్ దారుణమైన ప్లాపుగా మిగిలిపోయింది. నైజాంలో వాల్తేరు వీరయ్య రు. 32 కోట్ల షేర్ వసూలు చేస్తే.. భోళాశంకర్ ఏడు కోట్ల దగ్గర ఆగిపోయింది.